హైదరాబాద్‌లో ఒడిశా బాబా రాసలీలలు: అరెస్ట్

భువనేశ్వర్: ఒడిశాకు చెందిన వివాదాస్పద స్వామి సారథి బాబాను ఆ రాష్ట్ర పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. కేంద్రపారా జిల్లాలోని బారిములాలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని తనకు తాను శ్రీకృష్ణుడి అవతారంగా చెప్పుకొంటున్న సారథి బాబా అలియాస్ సంతోష్ రౌల్.. జులై నెలలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఒక మహిళతో సన్నిహితంగా ఉండటం ద్వారా వార్తల్లోకి ఎక్కారు.

జీన్స్, టీషర్టులు ధరించి కొత్త అవతారంలో మూడురోజులపాటు ఆ హోటల్‌లో గడిపిన సారథి.. ఆ మహిళను తన భార్యగా రిసెప్షన్‌లో పేర్కొన్నారు. అయితే ఒడిశాకు చెందిన ఓ స్థానిక ఛానల్.. హోటల్‌లో ఆయన వ్యవహారానికి సంబంధించిన ఫొటోలను ప్రసారం చేసింది. సోషల్ మీడియాలోనూ ఈ ఫొటోలు హల్‌చల్ చేయడంతో సారథి వాటిని ఖండించారు. అవి తనవికావంటూ ఆ ఛానల్‌పై చట్టపరమైన చర్య తీసుకుంటానని ప్రకటించారు.

కానీ, సారథి బాబా వ్యవహారం రట్టు కావడంతో ఆయనపై చర్య తీసుకోవాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. బరిములాలోని ఆశ్రమం ఎదుట నిరంతరాయంగా ఆందోళనలు కొనసాగడంతో ఆశ్రమాన్ని తనిఖీ చేసిన క్రైంబ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

After Radhe Maa, now Sarathi Baba: Self styled godman caught with woman in hotel; arrested

కొన్ని పత్రాలు, నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు హోటల్‌లో సారథితో ఉన్నట్లు భావిస్తున్న మహిళ.. తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నలుగురు వ్యక్తులు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, వారిని అంతకుముందు సారథి బాబా ఆశ్రమంలో చూశానని చెప్పింది. కాగా, ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి నిందితుడైన బాబాకు సహకరిస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+