కేజ్రీవాల్ సర్కారుకు కేంద్రం షాక్: ఢిల్లీలో మళ్లీ ఎల్జీకే అధికారాలిస్తూ కొత్త ఆర్డినెన్స్ జారీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వానికి భారీ ఝలక్ ఇచ్చింది. ఢిల్లీ పరిపాలన, అధికారుల బదిలీలపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన 10 రోజుల్లోనే.. తాజాగా, శుక్రవారం కేంద్ర ప్రభుత్వం బదిలీ, విజిలెన్స్ వంటి అంశాల్లో ఆర్డినెన్స్ జారీ చేసి చట్ట సవరణ చేసింది. దీంతో న్యాయస్థానం ఆదేశాల ప్రభావం ఉండదు.

న్యాయ మంత్రిత్వ శాఖ ఆర్డినెన్స్ సహాయంతో చట్టాన్ని మార్చబోతోంది. ఢిల్లీ పరిపాలనపై కేజ్రీవాల్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలను తటస్థీకరించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ ఈ ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టింది.

Delhi Govt

ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించిన అధికారం ఢిల్లీ ప్రభుత్వానిదేనని తొమ్మిది రోజుల క్రితం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్.. సీఎం అంటే ప్రభుత్వం లేదా మంత్రివర్గం సలహా మేరకు పని చేస్తారు. ఈ నిర్ణయం ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సాధించిన పెద్ద విజయంగా అభివర్ణించింది. అంతలోనే ఇప్పుడు కేంద్రం కొత్త షాకిచ్చింది.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కొట్టిపారేయడానికి ప్రయత్నించిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. కేంద్రం కుట్రలను తాము అడ్డుకుంటామని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరుకునేట్లు కనిపిస్తోంది.

ఐఏఎస్ అధికారి వర్సెస్ ఆప్ మంత్రి

ఐఏఎస్‌లు సహా ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. తీర్పు వెలువడిన సాయంత్రమే సేవల విభాగం కార్యదర్శి ఆశిష్ మోరెను పదవి నుంచి తప్పించారు. అయితే, ఇప్పుడు ఆశిష్ మోరె.. ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్‌పై చీఫ్ సెక్రటరీ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిరయాదు చేశారు. ఆయనతో తనతో తప్పుగా ప్రవర్తించారన్నారు.

'మే 16న మంత్రి భరద్వాజ్ నన్ను అతని చాంబర్‌కు పిలిచారు. నాతో తప్పుగా ప్రవర్తించారు. నాపై దాడి చేశారు. నన్ను బెదిరించారు. దీనిపై ప్రభుత్వం వెంనటే చర్యలు తీసుకోవాలి. నాకు భద్రత కల్పించాలని కోరుతున్నాను' అని ఆశిష్ మోరె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, మోరె ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. కోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా చేస్తున్న కుట్ర అని మంత్రితోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. సదరు అధికారి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి భరద్వాజ్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+