• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాహుల్‌తో నో, ప్రియాంకతో ఓకే : తమ మధ్య విభేదాలు లేవన్న తేజస్వి, కలిసి ప్రచారం చేస్తామని వెల్లడి

|

పాట్నా : ఎన్డీఏను గద్దె దింపేందుకు జట్టు కట్టిన మహాకూటమి నేతల ఎడమొహం, పెడమొహం కూటమిలో చీలిక వచ్చిందా అనే అనుమానాలకు రేకెత్తించింది. బీహార్‌లో ఆర్జేడీ నేత, మహాకూటమి అధికార ప్రతినిధి తేజస్వి యాదవ్ .. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌తో అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. రాష్ట్రంలో రాహుల్ నిర్వహించిన మూడు రోడ్ షోలకు దూరంగా ఉన్నారు.

ఏం జరుగుతోంది ?

ఏం జరుగుతోంది ?

రాష్ట్రంలో మోదీ నిర్వహించిన ర్యాలీలో బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎల్జేపీ అధినేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీ మహాకూటమిపై విమర్శలు చేసింది. కూటమిలో ఏం జరుగుతుందోనని, బీహార్ బీజేపీ అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ ప్రశ్నించారు. రాహుల్ సభలకు తేజస్వి డుమ్మా వెనుక కారణాలేంటని ప్రశ్నించారు.

ఇక పాల్గొంటా ..

ఇక పాల్గొంటా ..

విపక్షాలు ప్రశ్నించడంతో తమ కూటమి అస్థిత్వం ప్రమాదంలో పడిందనే సంకేతాలు ఎక్కడ జనాలకు వెళ్తుందోనని ఆర్జేడీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు 7 విడుతలు జరుగుతుండగా ... బీహార్‌లో మొత్తం 7 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 విడతలకు ప్రచారం ముగిసినందున .. మరో 4 విడతల్లో రాహుల్, ఆయన సోదరి ప్రియాంకతో కలిసి ప్రచారం నిర్వహిస్తానని తేజస్వి యాదవ్ స్వయంగా ప్రకటించారు.

అవును .. క్లారిఫై చేసిన కాంగ్రెస్

అవును .. క్లారిఫై చేసిన కాంగ్రెస్

తేజస్వి ప్రకటనను కాంగ్రెస్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. వచ్చే 4 విడతల్లో ప్రియాంక గాంధీతో తేజస్వి స్టేజీ పంచుకుంటారని పేర్కొన్నాయి. ఇదివరకు రాహుల్, తేజస్వి యాదవ్ .. బీహార్, జార్ఖండ్ సీట్ల పొత్తుపై చర్చలు కూడా జరిపారని పేర్కొన్నారు. రాహుల్‌తో అభిప్రాయ బేధాలు ఉన్నాయా అని మీడియా ప్రతినిధులు తేజస్వి యాదవ్‌ను ప్రశ్నిస్తే ,, అదేం లోదని తోసిపుచ్చారు.

సుపౌల్ మాత్రం నో

సుపౌల్ మాత్రం నో

రాష్ట్రంలో మహాకూటమి పోటీచేనే అన్ని స్థానాల్లో ప్రచారం నిర్వహిస్తానని తేజస్వి స్పష్టంచేశారు. కానీ సుపౌల్ నుంచి మాత్రం తాను ప్రచారం నిర్వహించబోనని తేల్చిచెప్పారు. ఇక్కడ కూటమి అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహిస్తే మధేపురలో శరద్ యాదవ్ విజయవకాశాలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. అయితే రాహుల్ తో చర్చల సందర్భంగా కాంగ్రెస్ కు కేవలం 9 సీట్లే కేటాయిస్తామని తేజస్వి యాదవ్ అనడంతో వివాదానికి కారణమైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tejashwi Yadav and Rahul Gandhi, the star speakers for the opposition Mahagathbandhan in Bihar, have yet to share a stage for the national election campaign. It speaks volumes about the alliance as the country preps for the third round of voting tomorrow.Rahul Gandhi has addressed three meetings, including in Gaya for ally Jeetan Ram Manjhi, and two for Congress candidates Uday Singh in Purnea and Ranjeeta Ranjan in Supaul. Tejashwi Yadav's absence was a standout feature in all these rallies, which fueled speculation that all is not well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more