ఇండిగో ఎయిర్ లైన్స్ తగ్గింపు ధరలు.. రూ.777 నుంచి ప్రారంభం

రాయితీ టిక్కెట్ల పోరులోకి ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా దిగింది. దేశీయ మార్గాలలో ఎంపిక చేసిన మార్గాలలో అన్నీ కలుపుకొని రూ.777కే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది.

ముంబై: రాయితీ టిక్కెట్ల పోరులోకి దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా దిగింది. దేశీయ మార్గాలలో తగ్గింపు ధరలను ఈ సంస్థ ప్రకటించింది. ఎంపిక చేసిన మార్గాలలో అన్నీ కలుపుకొని రూ.777కే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది.

ఈ ఆఫర్ కింద ఫిబ్రవరి 25 వరకే టిక్కెట్లు బుక్ చేసుకునే వీలుంది. అలాగే ఈ టిక్కెట్ల ద్వారా ఏప్రిల్ 27 వరకు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. సెలెక్టడ్ సెక్టార్లో, సెలెక్టడ్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.

After Spicejet, Indigo launches Rs 777 offer

ఈ తగ్గింపు టిక్కెట్ల ధరలు అగర్తలా-గౌహతి, శ్రీనగర్-చండీగఢ్ మార్గాలలో రూ.777కే అందుబాటులో ఉండగా, చెన్నై-హైదరాబాద్ మార్గంలో మాత్రం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 19 రోజుల ముందుగా బుక్ చేసుకోవాలని, సీట్లు పరిమితంగా ఉన్నాయని ఇండిగో తెలిపింది.

ఒకవేళ ప్రయాణాన్ని విరమించుకుని టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాలు, సందేహాలకు ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని సంస్థ కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+