Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇకపై రాత్రిపూట కూడా: పోస్టుమార్టంలపై కేంద్రం కీలక నిర్ణయం, అలాంటి కేసుల్లో కండిషన్స్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైన వ్యక్తి చనిపోయిన తర్వాత మెడికోలీగల్ కేసులన్నింటికీ చట్ట ప్రకారం పోస్టుమార్టం చేస్తారు. ఈ చట్టం ప్రకారం ఇప్పటి వరకు పగటిపూట మాత్రమే పోస్టుమార్టం చేసేందుకు అనుమతి ఉంది. దీంతో కొన్ని సందర్భాల్లో పోస్టుమార్టం కోసం కొన్ని గంటలపాటు ఆస్పత్రుల్లోనే మృతదేహం కోసం ఉంచాల్సి వచ్చేది.

ఈ నేపథ్యంలో సూర్యాస్తమయం తర్వాత రాత్రిపూట కూడా పోస్టుమార్టం చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. పోస్టుమార్టం చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలున్న ఆస్పత్రుల్లో పోస్టుమార్టంను 24 గంటలూ చేసేందుకు నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.

 After sunset too: Health Ministry notifies new protocol for post-mortem procedure.

ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ పాలన ముగిసింది. ఇక 24 గంటలూ పోస్టుమార్టం చేయవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన మేరకు సుపరిపాలన అందించడంలో భాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాత్రి వేళల్లో పోస్టుమార్టం చేసేందుకు సౌకర్యాలున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇక నుంచి సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టం నిర్వహించవ్చని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు.

అయితే, హత్య, ఆత్మహత్య, అత్యాచారం, కుళ్లిపోయిన మృతదేహాలకు మాత్రం రాత్రిపూట చేయరాదని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేగాక, రాత్రిపూట చేసే పోస్టుమార్టంలకు తప్పనిసరిగా వీడియో చిత్రీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పస్టం చేసింది.

Recommended Video

    IAF’s Fighter Aircraft Conduct Trail Run On Its Airstrip In Sultanpur || Oneindia Telugu

    కాగా, మెడికో లీగల్ కేసుల్లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే సమయంపై ఎన్నో రోజులుగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ విభాగంలోని సాంకేతిక కమిటీ పరిశీలించింది. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, ముఖ్యంగా రాత్రివేళ్లలో పోస్టుమార్టానికి అవసరమైన లైటింగ్ తోపాటు మౌలిక సదుపాయాలను ఆయా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయడం సాధ్యమేనని కమిటీ తెలిపింది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో రాత్రిపూట కూడా పోస్టుమార్టం చేస్తున్నాయనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+