woman: రిటైడ్ లెఫ్టినెంట్ కల్నల్ భార్యను మంచానికి కట్టేసి సజీవదహనం, అక్రమ సంబంధం ?
బెంగళూరు/మండ్య: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు పిల్లలు లేరు. భార్య టైలర్ పని చేస్తోంది. భర్త ఉద్యోగం చేసేవాడు. అనారోగ్యం కారణంగా భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత చీటీలు నడుపుతున్న మహిళ టైలర్ పని చేస్తోంది. చీటీల వ్యవహారంతో చాలా మంది ఆమె ఇంటికి వచ్చి వెలుతున్నారు. రాత్రి మహిళ ఇంట్లో ఉంది. తరువాత మహిళ నివాసం ఉంటున్న ఇంటిలోనే ఆమెను సజీవదహనం చేసి పరార్ కావడం కలకలం రేపింది.

సొంత ఇంటిలో కాపురం
కర్ణాటకలోని మండ్య జిల్లాలోని మద్దూరు తాలుకాలోని మారసింగనహళ్లి ప్రాంతంలో లిఫ్ట్ నెంట్ కల్నల్ కుమార్ ఆరాధ్య అలియాస్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమా (42) అనే మహిళను కుమార్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కుమార్, ప్రేమా దంపతులు వారి సొంత ఇంటిలో నివాసం ఉంటూ చాలా సంతోషంగా కాపురం చేశారు.

భర్త చనిపోయాడు
కుమార్, ప్రేమా దంపతులకు పిల్లలు లేరు. ప్రేమా భార్య టైలర్ పని చేస్తోంది. కుమార్ లెఫ్టినెంట్ కల్నల్ గా ఉద్యోగం చేసి రిటైడ్ అయ్యాడు. . అనారోగ్యం కారణంగా మూడు సంవత్రసాల క్రితం ప్రేమా భర్త కుమార్ చనిపోయాడు. భర్త కుమార్ చనిపోయిన తరువాత ప్రేమా గ్రామంలోని సొంత ఇంటిలో నివాసం ఉంటూ చీటీలు నడుపుతోంది. చీటీల వ్యాపారంతో పాటు ప్రేమా టైలర్ పనికూడా చేస్తోంది.

ఇంట్లో మంచానికి కట్టేసి పెట్రోల్ పోసి సజీవదహనం
చీటీల వ్యవహారంతో చాలా మంది ప్రేమా ఇంటికి వచ్చి వెలుతున్నారు. రాత్రి ఇంట్లో ప్రేమా ఒక్కటే ఉంది. తరువాత ప్రేమ ఇంటిలోకి వెళ్లిన నిందితులు ఆమెను గొంతు నులిమేశారు. ప్రేమా శవాన్ని బెడ్ రూమ్ లో మంచానికి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైనారు, ప్రేమా ఇంటి నుంచి మంటలు వ్యాపించిన విషయం ఆలస్యంగా గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి మంటలు అదుపు చేసి చూడగా అప్పటికే ప్రేమా ప్రాణాలు పోయాయని వెలుగు చూసింది.

అక్రమ సంబంధంతో సజీవదహనం ?
అక్రమ సంబంధం కారణంగా విధవ ప్రేమా హత్యకు గురైయ్యిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ప్రేమా ఇంటికి ఎవరెవరు వచ్చి వెలుతున్నారు ?, ఆమెతో ఎవరెవరికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి ? అని ఆరా తీస్తున్నామని మద్దూరు పోలీసులు తెలిపారు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న విధవ ప్రేమాను సజీవదహనం చెయ్యడం మండ్య జిల్లాలో కలకలం రేపింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications