ఇలా అయితే పార్లమెంట్ మూసుకోవాలి-సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ ఫైర్..!
రాష్ట్రాల అసెంబ్లీలు పంపిన బిల్లుల్ని మూడు నెలలకు మించి గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ పెండింగ్ లో పెట్టకుండా సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు కేంద్రంలో తీవ్ర కలకలం రేపినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో తొలుత ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ సుప్రీంకోర్టు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన బాటలోనే బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఇవాళ సుప్రీంకోర్టుపై మాటల దాడికి దిగారు.
తాజాగా వక్ఫ్ చట్టం విషయంలో కేంద్రం దూకుడుకు కళ్లెం వేసేలా సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్పందిస్తూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఈ విమర్శలు చేశారు. మిమ్మల్ని నియమించే వారికి మీరు ఎలా దిశానిర్దేశం చేయగలరంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బీజేపీ ఎంపీ ప్రశ్నించారు. భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారని, ఈ దేశ చట్టాన్ని పార్లమెంటు రూపొందిస్తుందని, ఆ పార్లమెంటును మీరెలా నిర్దేశిస్తారని ఆయన ప్రశ్నించారు.

#WATCH | BJP MP Nishikant Dubey says, "How can you give direction to the appointing authority? The President appoints the Chief Justice of India. The Parliament makes the law of this country. You will dictate that Parliament?... How did you make a new law? In which law is it… https://t.co/CjTk4wBzHA pic.twitter.com/HYNa8sxBVt
— ANI (@ANI) April 19, 2025
మీరు కొత్త చట్టాన్ని ఎలా తయారు చేశారంటూ సుప్రీంకోర్టును నిశికాంత్ దూబే ప్రశ్నించారు. మూడు నెలల్లోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని ఏ చట్టంలో రాశారంటూ ఆయన అడిగారు. దీని అర్థం మీరు ఈ దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలనుకుంటున్నారని విమర్శించారు. పార్లమెంటు సమావేశమైనప్పుడు దీనిపై వివరణాత్మక చర్చ జరుగుతుందన్నారు. దేశంలో మత యుద్ధాల్ని సుప్రీంకోర్టు ప్రేరేపిస్తుందని బీజేపీ ఎంపీ దూబే ఆరోపించారు. సుప్రీంకోర్టు తన పరిమితులను మించి పనిచేస్తోందన్నారుు. ప్రతిదానికీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తే, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ మూసివేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Delhi: "...Supreme Court is responsible for inciting religious wars in the country. The Supreme Court is going beyond its limits. If one has to go to the Supreme Court for everything, then Parliament and State Assembly should be shut..." says BJP MP Nishikant Dubey pic.twitter.com/ObnVcpDYQf
— ANI (@ANI) April 19, 2025
సుప్రీంకోర్టుపై నిశికాంత్ దూబే చేసిన విమర్శలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. సుప్రీంకోర్టును బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఉద్దేశపూర్వకంగా విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఆరోపిచారు. సుప్రీంకోర్టును బీజేపీ లక్ష్యంగా చేసుకుందన్నారు. ఎన్నికల బాండ్ల సమస్య ఉందని,వక్ఫ్ సమస్య వచ్చిందని, ఎన్నికల కమిషన్ సమస్య రాబోతోందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ వెల్లడించారు.
మరో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ కూడా సుప్రీంకోర్టుపై నిషికాంత్ దూబే చేసిన ప్రకటనను అపఖ్యాతి తెచ్చిపెట్టేదిగా అభివర్ణించారు. అత్యున్నత న్యాయస్థానంపై ఆయన చేసిన దాడి ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా చేసిన పరువు నష్టం కలిగించే ప్రకటన అన్నారు. నిషికాంత్ దూబే ఇతర సంస్థలన్నింటినీ నిరంతరం కూల్చివేసే వ్యక్తి అన్నారు. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టుపై దాడి చేశారన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications