వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగాలాండ్ సంక్షోభం:కొత్త ముఖ్యమంత్రిగా లీజియెట్స్ ఎంపిక, జెలియాంగ్ కు పార్టీ పదవి

నాగాలాండ్ అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ అధినేతగా ఉన్న మర్హోజెలీ లీజియెట్స్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. 42 మంది ఎంఏల్ఏలలో 40 మంది ఆయనకే మద్దతుగా నిలిచారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నాగాలాండ్:నాగాలాండ్ అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ అధినేతగా ఉన్న మర్హోజెలీ లీజియెట్స్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. 42 మంది ఎంఏల్ఏలలో 40 మంది ఆయనకే మద్దతుగా నిలిచారు.

నాగాలాండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసింది. రాజకీయ సంక్షోభంతో టీఆర్ జెలియాంగ్ రాజీనామా చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను ఇవ్వాలన్న నిర్ణయంపై ప్రజా ప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

ప్రజా ప్రతినిధులంతా మూకుమ్మడిగా ముఖ్యమంత్రిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎంఏల్ఏల తిరుగుబాటుతో ముఖ్యమంత్రి పదవికి జెలియాంగ్ రాజీనామా చేశారు.

After Zeliang resignation, NPF chooses Shurhozelie Liezietsu as next Nagaland CM

81 ఏళ్ళ లీజియెట్స్ కు 40 మంది ఎంఏల్ఏలు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన నాగాలాండ్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

నాగాలాండ్ అసెంబ్లీలో 60 అసెంబ్లీ స్థానాలుంటే నాగా పీపుల్స్ ఫ్రంట్ 48 స్థానాలను కైవసం చేసుకొంది. మిగిలిన 12 స్థానాలు ఆ పార్టీ మిత్రపక్షమే కైవసం చేసుకొంది. దీంతో ఆ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోయింది.

2015 సంవత్సరంలో కూడ ఒకసారి జెలియాంగ్ ప్రభుత్వాన్ని ప్రయత్నాలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి నాగాలాండ్ నుండి ఏకైక ఎంపి నెయిఫియి రియో అప్పట్లో ఈ ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు.

ఎంఏల్ఏలు మాత్రం లీజియెట్స్ ను తమ నాయకుడిగా ఎన్నుకొన్నారు. ఆయన కూడ ఎన్ పి ఎఫ్ నేతృత్వంలోని డెమొక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ కు నేతృత్వం వహించేందుకు ఆయన అంగీకరించాడు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించకుండా పరిపాలనను పునరుద్దరించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారు.

English summary
The ruling Democratic Alliance of Nagaland (DAN) ended all speculations on Monday by choosing Naga People’s Front (NPF) president Shurhozelie Liezietsu as the next chief minister of Nagaland.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X