ఆమెకు 65.. అతనికి 21.. లవ్ మ్యారేజ్ తో ఒక్కటయ్యారు..
లేటు వయసులో ఘాటు ప్రేమ అంటే ఇదేనేమో.. 21 ఏళ్ల యువకుడు 65 ఏళ్ల ముసలావిడను ప్రేమించి పెళ్లిచేసుకున్న విచిత్ర ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఓల్డ్ ఈ జ్ గోల్డ్ అంటూ ఆ యువకుడు చేసిన ఈ సాహసానికి నెటిజెన్లు షాక్ అవుతున్నారు. సభ్య సమాజం తలవంచుకునే ఈ ఘటన హరియాణాలో జరిగింది.
హరియాణాలో షాకింగ్ ఘటన జరిగింది. 65 ఏళ్ల అమ్మమ్మ 21 ఏళ్ల యువకుడితో లవ్ లో పడింది. అలా ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. హరియాణాలోని యమునా నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
యమునా నగర్ కు చెందిన 21 ఏళ్ల మహమ్మద్ ఇర్ఫాన్ తన 65 ఏళ్ల అమ్మమ్మ సుల్తానా ఖాటూన్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వార్త హరియాణాలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుల్తానా భర్త మరణం తర్వాత మనవడు ఇర్ఫాన్ వద్దే ఉంటోంది. ఈ క్రమంలో వాళ్లిద్దరూ మరింత దగ్గరయ్యారు. అది కాలక్రమేణా ప్రేమగా మారింది. చివరకు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఈ ఘటనతో ఇరువురి బంధువులతోపాటు గ్రామస్థులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ విధమైన వివాహం వారి మతపరంగా, సంప్రదాయంగా కూడా పద్దతి కానప్పటికీ.. ఇద్దరి అంగీకారంతోనే ఈ వివాహం జరిగినట్లు సమాచారం. ఇలాంటి విచిత్రమైన పెళ్లిళ్లు గతంలోనూ జరిగిన సందర్భాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం 27 ఏళ్ల ప్రవీణ్ అనే యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన 65 ఏళ్ల అమెరికన్ మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ ఘటన కూడా హరియాణాలోనే జరిగింది.
ఇలాంటి వివాహాలను కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. తప్పుగా చూస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం ప్రేమకు వయసు అడ్డు రాదని చెబుతున్నారు. ఈ ఘటనలపై రకరకాలుగా నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమకు పెళ్లికి వయసుతో సంబంధం లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications