Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుభాష్ చంద్రబోస్ మరణించలేదు..విమాన ప్రమాదసమయంలో మాతోనే ఉన్నారు: ఐఎన్ఏ సైనికులు

దేశ రాజధాని ఢిల్లీలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సారి వేడుకల్లో ప్రత్యేకత కనిపించింది. ప్రతిసారిలా కాకుండా ఈసారి మాత్రం వేడుకల్లో తొలిసారిగా కొందరు వ్యక్తులు కవాతు చేశారు. వారిని స్వయంగా కేంద్రప్రభుత్వమే కవాతు చేయాల్సిందిగా ఆహ్వానించింది. ఇంతకీ వీరు ఎవరు.. వీరు అంత ప్రత్యేకంగా ఎందుకు పరిగణించబడుతున్నారు. తెలుసుకోవాలంటే లెట్స్ రీడ్ దిస్ స్టోరీ....

కవాతు చేసిన సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు

కవాతు చేసిన సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు

దేశం 70వ గణతంత్రవేడుకలు జరుపుకుంటోంది. దేశరాజధాని ఢిల్లీలో మాత్రం ఈ గణతంత్ర వేడుకల్లో ఓ ప్రత్యేకత కనిపించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన నాటి నలుగురు సైనికులు సారి రాజ్‌పథ్‌లో కవాతు చేశారు. ప్రస్తుతం వీరి వయస్సు 90 ఏళ్ల నుంచి 100 ఏళ్ల మధ్య ఉంది. నాడు బ్రిటీషు వారితో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. నేడు స్వాతంత్ర్యం సిద్ధించాక దేశ ఘనమైన వేడుకల్లో కవాతు చేశారు.

 సుభాష్ చంద్రబోస్ మరణించలేదు... ఇప్పటికీ బతికే ఉన్నాడు

సుభాష్ చంద్రబోస్ మరణించలేదు... ఇప్పటికీ బతికే ఉన్నాడు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇప్పటికీ తమ నాయకుడంటూ చాలా గర్వంగా చెబుతున్నారు ఈ సైనికులు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాడు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు నిచ్చారని అయితే అది నాడు సాధ్యపడలేదని ఇప్పుడు రాజ్‌పథ్‌లో కవాతు చేసి నేతాజీ పిలుపును నేడు నెరవేర్చినట్లుగా భావిస్తున్నామని ఆనందంతో చెప్పారు. లాల్తీ రామ్ అనే 96ఏళ్ల నాటి సైనికుడు ఐఎన్ఏతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. నాడు ఆర్టిలరీలో తన పోస్టింగ్ ఉండేదని నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. అంతేకాదు ఇప్పటికీ విమాన ప్రమాదంలో నేతాజీ సుబాష్ చంద్రబోస్ మరణించాడంటే లాల్తీరామ్ నమ్మరు. నేతాజీ విమానప్రమాదంలో మృతిచెందారనే వార్త ప్రపంచానికి తెలిసిన కొద్ది గంటల్లోనే ... బోస్ బ్రిగేడ్‌తో పాటు కూర్చుని ఉన్నారని చెబుతున్నారు. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంకా బతికే ఉన్నారన్న దృఢ నమ్మకాన్ని లాల్తీరాం వ్యక్తపరిచారు.

 ఆలస్యమైనా సరే మోడీ వీరిని గుర్తించారు

ఆలస్యమైనా సరే మోడీ వీరిని గుర్తించారు

మరో ఐఎన్ఏ సైనికుడు 97 ఏళ్ల హీరా సింగ్ మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం నలుగురు సైనికుల్లో 100 ఏళ్ల వయసున్న మరో సైనికుడు భగ్మల్, 99 ఏళ్ల పరమానంద్ కూడా తమ అనుభవాలు పంచుకున్నారు. హర్యానా రాష్ట్రం మనేసర్‌కు చెందిన భగ్మల్ 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరాడు. ఆలస్యమైనా సరే ప్రధాని నరేంద్ర మోడీ ఈ వీరజవాన్లను గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కవాతు చేసే భాగ్యం కల్పించిన ప్రధానికి ధన్యవాదాలు అంటూ రక్షణ నిపుణులు మేజర్ జనరల్ జీడీ భక్షీ తెలిపారు. నాడు దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు పనంగా పెట్టి ఇండియన్ నేషనల్ ఆర్మీలో ప్రదాన పాత్ర పోషించిన సైనికులు ఇంకా ఏడెనిమిది మంది బతికే ఉన్నారని చెప్పిన మేజర్ జనరల్ భక్షీ ... వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+