ఇన్సూరెన్స్ చేస్తారు... తర్వాత బీమా డబ్బు కోసం చంపేస్తారు - ప్రెస్ రివ్యూ
బీమా చేసి, తర్వాత ఆ బీమా డబ్బు కోసం వారిని చంపేసే మాఫియా ఆగడాలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగాయని ఈనాడు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.
మారుమూల గిరిజన తండాల్లో అనారోగ్యంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారి పేరుతో ప్రీమియం కట్టి అనంతరం బీమా డబ్బుల కోసం హత్య చేసి ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్న ముఠా దందా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించిందని నల్గొండ పోలీసులు గుర్తించారు.
ముఠా సభ్యులు ఏడేళ్ల నుంచి దామరచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దాచేపల్లి, మాచర్ల, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో పదిమందిని ఇలా హత్య చేసినట్లు తెలిసిందని ఈనాడు రాసింది.
ఈ ముఠాలో దామరచర్ల మండలానికి చెందిన ఓ ఏజెంటుతో పాటు మాచర్లకు చెందిన ఏజెంటు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ దందాతో సంబంధం ఉన్న 20 మంది నిందితులను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
ఇందులో మరిన్ని విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తున్నట్లు సమాచారం.
మంగళవారం 'ఈనాడు'లో 'బీమాసురులు' శీర్షికతో ప్రచురితమైన కథనం ఆధారంగా నిందితులను విచారించగా.. పత్రికలో వచ్చిన అన్ని విషయాలను వారు అంగీకరించారని కేసు విచారణలో కీలకంగా ఉన్న ఓ అధికారి వెల్లడించడం గమనార్హం.
ఈ ముఠా తొలుత 2013లో గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వ్యక్తిని హత్య చేయగా అక్కడి పోలీసులు బీమా కోసమే ఇలా చేశారని తేల్చారు.
దీంతో నిందితులు గిరిజన ప్రాంతాలున్న దామరచర్ల, మాచర్ల, ఒంగోలు ప్రాంతాలపై దృష్టి సారించారు. ఒక్క దామరచర్ల మండలంలోనే దాదాపు ఏడుగురిని హతమార్చామని అంగీకరించినట్లు సమాచారం అందిందని ఈనాడు రాసింది.
సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో భాగస్వామ్యం ఉన్న వైద్యులు, పోలీసులు, బ్యాంకర్ల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు.
మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో బీమా ప్రీమియం చెల్లించి ఏడాది లోపే పాలసీలు క్లెయిమ్ చేసుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. పలువురు నామినీలను మంగళవారం నల్గొండకు పిలిపించి విచారించినట్లు తెలిసిందని ఈనాడు చెప్పింది.
పాలసీ క్లెయిమ్‌లకు ఎఫ్‌ఐఆర్, పోస్టుమార్టం రిపోర్టు కీలకం కావడంతో తప్పుడు ఎఫ్‌ఐఆర్, పోస్టుమార్టం రిపోర్టు ఇచ్చిన అప్పటి పోలీసులను, వైద్యులను విచారించనున్నట్లు తెలిసింది.
మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గతేడాది జరిగిన రెండు అనుమానాస్పద మరణాల్లో వైద్యులు శవ పంచనామా నిర్వహించారు. దీని ఆధారంగా పోలీసులు బాధితులకు ఎఫ్‌ఐఆర్ ఇచ్చారు.
వాటిలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించడంతో నల్గొండ ఎస్పీ రంగనాథ్ వాటన్నింటినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని ఈనాడు వివరించింది.
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- చనిపోయిన వృద్ధురాలికి పింఛన్ ఇచ్చిన గ్రామ వలంటీర్.. బతికే ఉన్నారంటున్న ఎంపీడీవో, చనిపోయారంటున్న కుటుంబసభ్యులు
కర్ణాటక మంత్రి వీడియో కలకలం
కర్ణాటక మంత్రి రమేశ్ జార్కిహొళి, ఒక మహిళతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.
ఉప ఎన్నికల ముంగిట కర్ణాటకలో శృంగార వీడియో బాంబు పేలింది. జలవనరులశాఖ మంత్రి రమేశ్ జార్కిహొళికి సంబంధించిన ఓ వీడియో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
మంత్రి రమేశ్ జార్కిహొళి ఓ యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను దినేశ్ కల్లహళ్లీ అనే సామాజిక కార్యకర్త బెంగళూరు మీడియాకు విడుదల చేశారు.
కేపీటీసీఎల్‌లో (కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్) ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్‌టీ నగర్‌కు చెందిన యువతిని లొంగదీసుకున్న మంత్రి రమేశ్‌జార్కిహొళి ఆమెతో రాసలీలలు జరిపినట్టు తెలుస్తోందని ఆంధ్రజ్యోతి చెప్పింది.
ఈ వీడియోను ఎక్కడ, ఎవరు తీశారనేది స్పష్టత లేదు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆనక మోసం చేసినందుకు ప్రతీకారంగా బాధితురాలేపక్కా ప్రణాళికతోనే వీడియో తీయించి ఉంటుందని భావిస్తున్నారు.
మరో కథనం ప్రకారం షార్ట్ ఫిల్మ్ తీసేందుకు మంత్రితో ఆమె సాన్నిహిత్యం పెంచుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని దినేశ్ కల్లహళ్లి బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారని పత్రిక రాసింది.
కాగా, కర్ణాటక శాసనసభ సమావేశాలు మరో రెండు రోజుల్లో మొదలవుతున్నాయి. అలాగే, రమేశ్ జార్కిహోళి అడ్డా బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్నాయి.
మరోవైపు శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు ఈ అంశం అస్త్రం గా మారకముందే ఆయనతో రాజీనామా చేయించే అంశాన్ని బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం.
అయితే, తన పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని బెంగళూరులో మంత్రి జార్కిహొళి స్పష్టం చేశారు.
'వీడియోను విడుదల చేసిన సామాజిక కార్యకర్త ఎవరో తెలియదు. వీడియోలో కనిపించిన యువతి ఎవరో కూడా తెలియదు. తప్పు చేసిన ట్టు రుజువైతే ఉరిశిక్షకూ సిద్ధమే' అని మంత్రి ప్రకటించారని ఆంధ్రజ్యోతి వివరించింది.
- 'గోమాంసం తినేవారి నుంచి అయోధ్య మందిరానికి విరాళం వద్దు’.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై వెల్లువెత్తిన విమర్శలు
- గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
ఆంధ్రప్రదేశ్‌కు రూ. 60కోట్ల విలువైన ప్రాజెక్టులు
ఏపీకి 60 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.
సూక్ష్మ, చిన్న పరిశ్రమలు-క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(ఎంఎస్‌ఈ-సీడీపీ) కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ.59.83 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
ఇందులో రూ.37.59 కోట్లతో సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం మూడు కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కేంద్ర ఎంఎస్‌ఈ-సీడీపీ స్టీరింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇందులో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బంగారు ఆభరణాల తయారీ క్లస్టర్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రింటింగ్ క్లస్టర్, మాచవరంలో పప్పులు తయారీ, వాటి ఉత్పత్తుల క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారని సాక్షి రాసింది.
ఈ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం గ్రాంట్ రూపంలో రూ.30.07 కోట్లు ఇవ్వనుంది. దీనికి అదనంగా ఇప్పటికే ఉన్న మూడు పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు.
మచిలీపట్నంలోని ఆభరణాల పారిశ్రామిక పార్కు, హిందూపురం గ్రోత్ సెంటర్, గుంటూరు ఆటోనగర్ ఇండ్రస్టియల్ పార్కులను రూ. 22.24 కోట్లతో ఆధునీకరించడానికి కేంద్రం తుది ఆమోదం తెలిపింది.
ఇందుకు కేంద్రం గ్రాంట్ రూపంలో రూ.15.57 కోట్లు సమకూర్చనుంది. మంగళవారం కేంద్ర ఎంఎస్‌ఎంఈ కార్యదర్శి అధ్యక్షతన సమావేశం జరిగిందని సాక్షి వివరించింది.
- 'శోభనం రాత్రి కోసం తెప్పించే స్పెషల్ స్వీట్’
- టీవీ డిబేట్లో చెప్పు విసిరిన వివాదం: అసలు గొడవ ఎక్కడ మొదలైంది.. ఎవరేమంటున్నారు

చొరబడలేకపోయిన చైనా
తెలంగాణ విద్యుత్ వ్యవస్థలో చొరబడేందుకు చైనా హ్యాకర్లు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.
తెలంగాణ విద్యుత్తు వ్యవస్థను ప్రభావితం చేసేందుకు చైనాకు చెందిన ఓ హ్యాకింగ్ గ్రూప్ విఫలయత్నం చేసినట్టు కేంద్రం పరిధిలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఇన్) వెల్లడించింది.
విద్యుత్తు వ్యవస్థను కాపాడుకొనేందుకు తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి సూచించింది.
దేశ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో చైనాకు చెందిన హ్యాకర్లు దేశంలోని విద్యుత్ గ్రిడ్లు, నౌకాశ్రయాలపై సైబర్ దాడులకు ప్రయత్నించారని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవలనే వెల్లడించిందని నమస్తే తెలంగాణ రాసింది.
చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో.. ఆ దేశ ప్రభుత్వ మద్దతుతో పనిచేస్తున్న కొన్ని గ్రూపులు మన దేశ కంప్యూటర్ వ్యవస్థ, డాటా సెంటర్లు, రక్షణ వ్యవస్థను హ్యాకింగ్ చేయవచ్చన్న అనుమానాలు ఇదివరకే వ్యక్తమయ్యాయి.
ఇది నిజమేనని అమెరికా వార్తా పత్రికలు కథనాలను ప్రచురించాయి.
తాజాగా చైనాకు చెందిన థ్రెట్ యాక్టర్ హ్యాకింగ్ గ్రూప్ తెలంగాణ సర్వర్లలోకి ప్రవేశించి విద్యుత్ వ్యవస్థను స్తంభింపజేసేందుకు ప్రయత్నించిందని, సీఈఆర్టీ-ఇన్ హెచ్చరించిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు మంగళవారం వెల్లడించారని నమస్తే తెలంగాణ రాసింది.
చైనా హ్యాకర్లు తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్డీసీ) ఆధ్వర్యంలోని విద్యుత్ రక్షణ వ్యవస్థకు చెందిన సర్వర్లలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని సీఈఆర్టీ హెచ్చరించిందని తెలిపారు.
రాష్ట్రంలోని కొన్ని సబ్‌స్టేషన్లలో చైనా థ్రెట్ యాక్టర్ ప్రవేశించినట్టు తెలిసిందన్నారు. దీంతో ఇంజినీరింగ్, కంప్యూటర్ నిపుణులను అప్రమత్తం చేశామని సీఎండీ చెప్పారు.
వెంటనే నిపుణులు ఎస్‌ఎల్డీసీ కేంద్రాన్ని సునిశితంగా పరిశీలించి సర్వర్లలోకి మాల్‌వేర్ (వైరస్) ప్రవేశించే ప్రయత్నం జరిగినట్టు గుర్తించారని తెలిపారు.
వెంటనే రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేశామని, తమ సాంకేతిక విభాగం ఎక్కడికక్కడ మాల్‌వేర్‌ను నిరోధించే చర్యలు తీసుకుంటున్నదని సీఎండీ తెలిపారు.
గ్రిడ్‌కు సంబంధించిన అధికారులు, సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించామని, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పినట్లు నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)