వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని నాలుగు సింహాలకు కొత్తగా కోరలొచ్చాయ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పార్లమెంట్ భవనంపై కొత్త నిర్మించిన అశోకచక్రం, నాలుగు సింహాల జాతీయ చిహ్నం.. దుమారం రేపుతోంది. జాతీయ చిహ్నంలో మోడీ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసిదనే విమర్శలకు దారి తీసింది. ఇదివరకెప్పుడూ, ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడలేదంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రధాని మోడీ ఏకంగా జాతీయ చిహ్నాలను సైతం చెరిపేసే ప్రయత్నాలు చేస్తోన్నారంటూ ధ్వజమెత్తుతున్నాయి.

పార్లమెంట్ భవనంపై కొత్తగా నిర్మించిన ఈ జాతీయ చిహ్నాన్ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 9,500 కిలోల బరువు, ఆరున్నర అడుగుల ఎత్తు ఉన్న ఈ చిహ్నం ఇది. ఇందులో గల నాలుగు సింహాల రూపాలను మోడీ ప్రభుత్వం మార్చివేసిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తోన్నాయి. ఇందులోని నాలుగు సింహాలకు కోరలు వచ్చినట్లు ఉద్దేశపూరకంగానే తయారు చేయించిందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు జవహర్ సర్కార్, మహువా మొయిత్రా ఆరోపించారు.

సాధారణంగా జాతీయ చిహ్నాన్ని రూపొందించే విషయంలో అశోక స్థూపంలో ఉన్న నాలుగు సింహాలను ప్రాతిపదికగా తీసుకుంటుంటారు. అందులో వాటి రూపం ఎలా ఉందో.. అలాగే తయారు చేస్తుంటారు. అవి చూడ్డానికి మనోహరంగా, రాజసం ఉట్టిపడేలా ఉంటాయి. దీనికి భిన్నంగా మోడీ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన చిహ్నంలో ఆ నాలుగు సింహాల మార్చి వేసిందంటూ చెప్పారు. కొత్తగా రూపొందించిన ఈ నాలుగు సింహాల రూపాలు గర్జిస్తున్నట్టుగా, కోరలను కూడా ప్రదర్శించేలా ఉన్నాయని గుర్తు చేశారు.

 Aggressive and disproportionate, TMC MPs critics over the National emblem

దేశ సమైక్యత, సమగ్రతకు నిలువుటద్దంలా ఉండే జాతీయ చిహ్నంలోనూ మార్పులు చేర్పులు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమానికి ఇతర పార్టీల నాయకులెవరినీ ఆహ్వానించకపోవడం కూడా ఇదివరకే వివాదాస్పదమైంది. దానిపైనా విమర్శలు చెలరేగాయి. మోడీ నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనమంటూ కాంగ్రెస్, సీపీఎం, ఏఐఎంఐఎం నాయకులు విమర్శించారు. దీనిపై గౌరవ్ గొగొయ్, అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

English summary
Ruling Party in West Bengal Trinamool Congress MPs Jawhar Sircar and Mahua Moitra have accused the Modi government at the Centre of insulting the national emblem by installing an aggressive and disproportionate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X