వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్ ఎదుట బైఠాయిస్తాం: రాకేశ్ టికాయత్

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నిరసన కొనసాగుతూనే ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. దీంతో పార్లమెంట్ ఎదుట బైఠాయిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ తెలిపారు. 22వ తేదీన నిరసన కొనసాగుతుందని చెప్పారు. వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ముందుకు రాలేదని.. మార్పు ఉండదని స్పస్టంచేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ గత 8 నెలల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రైతులందరూ కాకుండా ఒక్కో గ్రామం నుంచి 10 మంది రైతులు 15 రోజులపాటు ఆందోళన చేయాలని డిసిసన్ తీసుకున్నారు. ఇదీ కంటిన్యూ అవుతుందని చెప్పారు. కిసాన్ యూనియన్‌కు యూపీ, హర్యానా, పంజాబ్, రాజస్తాన్ నుంచి మంచి స్పందన వస్తోంది. యూపీలోని పశ్చిమ ప్రాంత రైతులు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 agitation at parliament outside:rakesh tikait

చట్టాలను రద్దు చేసి.. కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో చర్చలు కూడా జరిగాయి. అయినా సమస్య కొలిక్కిరాలేదు. దీంతో సుప్రీంకోర్టు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.

వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన కొనసాగుతోంది. 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు. పంటకు మద్దతు ధర ఇవ్వాలి.. సహా ఇతర డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. వీరి ఆందోళన పీక్‌కి చేరింది.

English summary
agitation at parliament outside farmer leader rakesh tikait said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X