వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్నటివరకు ఛీ అన్నారు... నేడు వాటేసుకున్నారు: అస్సోంలో బీజేపీ ఏజీపీ పొత్తు ఖరారు

|
Google Oneindia TeluguNews

గౌహతి: ఎన్నికల వేళ అస్సోంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అస్సోం గన పరిషత్ బీజేపీతో కలిసి పోటీచేసేలా పొత్తు కుదుర్చుకుంది. అస్సోం పౌరసత్వ బిల్లుపై రెండు నెలల క్రితం బీజేపీతో విబేధించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసింది అస్సోం గన పరిషద్ పార్టీ.

చంద్రశేఖర్ ఆజాద్‌ను పరామర్శించిన ప్రియాంకా గాంధీ..ఎవరీయన..?చంద్రశేఖర్ ఆజాద్‌ను పరామర్శించిన ప్రియాంకా గాంధీ..ఎవరీయన..?

మళ్లీ పట్టాలెక్కిన బీజేపీ-ఏజీపీ పొత్తు

మళ్లీ పట్టాలెక్కిన బీజేపీ-ఏజీపీ పొత్తు

బీజేపీ ఏజీపీల మధ్య చర్చలు సఫలం అయ్యాయని రెండు పార్టీలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ట్విటర్ వేదికగా పోస్టు చేశారు. అంతేకాదు కాంగ్రెస్‌ను ఓడించేందుకు రెండు పార్టీలు అస్సోంలో జతకట్టాయని రాంమాధవ్ తెలిపారు. ఇక బీజేపీ, ఏజీపీలతో పాటు మూడో పార్టీ బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ కూడా పొత్తుతో వెళ్లనుంది. చర్చలు సఫలం అవడం, మళ్లీ పొత్తు కుదరడంతో అంతకుముందు బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి రాజీనామా చేసిన ముగ్గురు ఏజీపీ సభ్యులు తిరిగి తమ రాజీనామాను వెనక్కు తీసుకుంటారని అస్సోం ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి శర్మ ట్వీట్ చేశారు.పౌరసత్వ బిల్లుపై గత కొంతకాలంగా బీజేపీ, ఏజీపీ పార్టీల మద్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. 2018 డిసెంబరులో పద్ధతి మార్చుకోకుంటే స్నేహానికి గుడ్‌బై చెప్పేస్తామంటూ ఏజీపీ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు లేఖ కూడా రాసింది. ఆ నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏజీపీ ఒంటరిగానే పోటీచేసింది. ఏజీపీపై బీజేపీ ప్రచారంలో నిప్పులు చెరిగింది.

అస్సోం పౌరసత్వ బిల్లును వ్యతిరేకించిన ఏజీపీ

అస్సోం పౌరసత్వ బిల్లును వ్యతిరేకించిన ఏజీపీ


ఇక అస్సోం పౌరసత్వ బిల్లు జనవరి 8న లోక్‌సభలో పాస్ అయ్యింది. దీంతో ఈశాన్య రాష్ట్రాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ముస్లింయేతర వలసదారులకు భారత పౌరసత్వాన్ని ఈ బిల్లు కల్పిస్తోంది. 1985 అస్సాం ఒప్పందం ప్రకారం 1971, మార్చి 24, అర్థరాత్రి దాటిన తర్వాత అస్సోంలోకి ప్రవేశించిన వ్యక్తిని విదేశీయుడిగానే పరిగణిస్తామని ఉంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ఏజీపీ బీజేపీతో విభేదించింది. అసలైన అస్సోం పౌరసత్వానికి బిల్లు తూట్లు పొడుస్తోందని ఏజీపీ ఆరోపించింది. అస్సోం ప్రాథమిక పీఠికను అందులోని విధానాలను ఉల్లంఘిస్తోందని బీజేపీ దృష్టికి తీసుకొచ్చింది. అయితే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టకపోవడంతో వీగిపోయింది. అయితే ఫిబ్రవరి 17న అస్సోంలో పర్యటించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బిల్లును మళ్లీ ప్రవేశపెడతాం అని చెప్పారు.

ప్రజలకు ఏజీపీ ఏమని వివరిస్తుంది..?

ప్రజలకు ఏజీపీ ఏమని వివరిస్తుంది..?

ఇప్పుడు బీజేపీతో తిరిగి ఏజీపీ జతకట్టడంతో పౌరసత్వబిల్లుపై ఇరుపార్టీ మధ్య ఉన్న విబేధాలు ఎలా తొలగించుకుని కలిసి వెళతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు ప్రజలకు ఏజీపీ ఎలాంటి సమాధానం ఇచ్చి తమను తాము సమర్థించుకుంటుందో కూడా ఆసక్తికరంగా మారింది. అస్సోం ఉద్యమం నుంచి ఏజీపీ ఆవిర్భవించింది. విదేశీ వ్యతిరేక ఉద్యమంను ఆరేళ్ల పాటు నడిపిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఓ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇలా ఏజీపీ ఓ రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. ఇదిలా ఉంటే 2016లో అస్సోంలోని 126 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ ఏజీపీలు కలిసి పోటీచేయగా కమలం పార్టీ 61 స్థానాల్లో విజయం సాధించింది... ఏజీపీ 14 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏజీపీ ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

English summary
The Asom Gana Parishad (AGP) finalised a pre-election understanding with the BJP late on Tuesday, barely two months after walking out of the parties’ alliance in the Assam government over differences regarding the Citizenship (Amendment) Bill.BJP national general secretary Ram Madhav posted on Twitter: “After discussion, BJP and AGP have decided to work together in the coming Parliament election in Assam to defeat Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X