బీజేపీ విలువలకు తిలోదాకాలిచ్చేసింది, సిగ్గు వీడి ప్రవర్తించింది: అహ్మద్ పటేల్

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశాక కొన్ని గంటలకు కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. సిగ్గు అనే పదానికి ఉన్న అన్ని పరిమితులను దాటి బీజేపీ ప్రవర్తించిందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్. అంతేకాదు ఫడ్నవీస్‌తో ప్రమాణస్వీకారం చేయిండంపై గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని తప్పుబట్టారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఇచ్చిన మద్దతు లేఖను కనీసం ధృవీకరించుకోకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అజిత్ పవార్‌తో ప్రమాణాస్వీకారం చేయించడం హేయమైన చర్యగా అహ్మద్ పటేల్ అభివర్ణించారు. ఇది మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చీకటిరోజని అన్నారు అహ్మద్ పటేల్.

మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తున్నామని చెప్పిన అహ్మద్ పటేల్... ఫడ్నవీస్ నవంబర్ 30వ తేదీన బలపరీక్షలు నెగ్గలేరని జోస్యం చెప్పారు అహ్మద్ పటేల్. మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అన్ని న్యాయపరమైన సలహాలు ,ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న ఆప్షన్స్‌ను పరిశీలిస్తున్నామని చెప్పిన అహ్మద్ పటేల్.. శివసేన ఎన్సీపీలతో తాము కలిసే నడుస్తామని స్పష్టం చేశారు. బలనిరూపణ సమయంలో ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన పార్టీలు కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొడతామని చెప్పారు.అదే సమయంలో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ధీమా వ్యక్తం చేశారు అహ్మద్ పటేల్.

Ahmad Patel says BJP has crossed all levels of shamelessness

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసిన రోజును చీకటిరోజుగా అభివర్ణించారు అహ్మద్ పటేల్. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేనలు కలిసి ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేయడం వల్లే బీజేపీ ఈ వ్యవహారంలోకి దూరిందని వస్తున్న వార్తలను అహ్మద్ పటేల్ తిరస్కరించారు. మూడు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి జాప్యం చోటుచేసుకోలేదని చెప్పిన అహ్మద్ పటేల్.. అజిత్ పవార్ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.

288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 44 సీట్లు కాంగ్రెస్‌కు ఉన్నాయి. ఎన్సీపీకి 54 స్థానాలు శివసేనకు 56 సీట్లు ఉన్నాయి. అహ్మద్ పటేల్‌ కంటే కొద్దిగా ముందుగా మాట్లాడిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరియు శివసేన ఉద్ధవ్ థాక్రేలు బీజేపీ పై నిప్పులు చెరిగారు. అజిత్ పవార్ పై వేటు వేస్తామని శరద్ పవార్ చెప్పగా.. బీజేపీ ప్రజాస్వామ్యంపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని ఫైర్ అయ్యారు థాక్రే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+