నో సెక్స్: ఏడాదికి పైగా ఎడబాటే, బీర్ తాగాలని వేధింపులు, చిన్నారికి బాటిల్..

ఎన్ఆర్ఐ సంబంధాలు అంటే ఎగిరి గంతేస్తారు. ఎక్కువ సంపాదన కాబట్టి పేరంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ చాలా మట్టుకు సైకో, శాడిస్టులు ఉంటారు. వారిని వరకట్న దాహం దహించివేస్తోంది. ఎన్ఆర్ఐ హరాస్‌మెంట్లకు సంబంధించి చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అహ్మదాబాద్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి బయటపడింది. ఓ వివాహిత తాను అనుభవించిన కష్టాన్ని తెలియజేసింది. తన సైకో భర్తపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.. పదండి.

బీర్ తాగమని ఫోర్స్..

బీర్ తాగమని ఫోర్స్..

అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతానికి చెందిన మహిళలకు 2016లో ఎన్ఆర్ఐ భర్తతో పెళ్లి జరిగింది. తర్వాత వారిద్దరు 2017లో దుబాయ్ వెళ్లిపోయారు. అప్పటివరకు బానే ఉన్నా.. దుబాయ్ వెళ్లాక మనొడి చేష్టలు అర్థం అయ్యాయి. వికృత చర్యలతో వేధించడం ప్రారంభించారు. వారికి వెంటనే ఓ కూతురు కూడా జన్మించింది. పాపకు రెండు సంవత్సరాలు కాగా.. భార్య, చిన్నారితో హ్యాపీగా ఉండాల్సింది పోయి.. గొడవ పడేవాడు. బీర్ తాగేవాడు.. తాగమని ఆమెను ఫోర్స్ చేసేవాడు. తాగిన బీర్ బాటిల్ చిన్నారికి ఇచ్చి తన పిచ్చిని ప్రదర్శించేవాడు.

 ఏడాదికిపైగా నో సెక్స్

ఏడాదికిపైగా నో సెక్స్

తన అత్త మామల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని వివాహిత ఆరోపించారు. దీనిని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. అయితే ఆ సైకో తనతో ఏడాదిగా కాపురం చేయడం లేదని వివరించింది. ఏడాదికి పైగా తామిద్దరం కలుసుకోలేదని వాపోయింది. తన బాగోగులు పట్టించుకోలేదని వాపోయింది. తన పాపకు బాగోలేకపోయిన పట్టించుకోలేదని.. కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లి మందులు కూడా ఇచ్చినా పాపాన పోలేదని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లోనే తిరిగి భారత్ వచ్చామని వివరించారు. తనను అమ్మగారింట్లో వదిలేసి.. తిరిగి దుబాయ్ పారిపోయారని తెలిపారు.

న్యాయం చేయండి..

న్యాయం చేయండి..

తన సైకో భర్త నుంచి న్యాయం చేయాలని వివాహిత కోరారు. తనకు భరణం ఇప్పించాలని వేడుకున్నారు. పెళ్లి సమయంలో కట్నం, లాంఛనాలు ఇచ్చి పెళ్లి చేశామని వివాహిత పేరంట్స్ చెప్పారు. కానీ తమ కూతురుకు వేధింపులు తప్పడం లేదని వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+