చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడు తమిళనాడు భవిష్యత్తు తేలిపోతుంది: ఎమ్మెల్యేలతో సీఎం భేటీ, శశికళ గ్యాంగ్ కు గాలం !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మైనారిటీలో ఉన్న తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పావులు కదుపుతున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మైనారిటీలో ఉన్న తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పావులు కదుపుతున్నారు. నేడు (మంగళవారం) అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి ఎవ్వరూ టీటీవీ దినకరన్ గ్రూప్ లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

లిఫ్ట్ లో చిక్కుకున్న తమిళనాడు మంత్రి, నరకం, భయంతో చెమటలు, తడిచి ముద్దయ్యాడు !లిఫ్ట్ లో చిక్కుకున్న తమిళనాడు మంత్రి, నరకం, భయంతో చెమటలు, తడిచి ముద్దయ్యాడు !

ప్రభుత్వంలో ఏ పని అయినా సరే వెంటనే మీకు చేసి పెడుతామని, మీ నియోజక వర్గాల అభివృద్ది కోసం భారీగా నిధులు కేటాయిస్తామని హామీలు ఇస్తున్నారని సమాచారం. టీటీవీ దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలకు సైతం సమావేశానికి హాజరుకావాలని సీఎం ఎడప్పాడి పళనిసామి ఆహ్వానం పంపించారు.

AIADMK covenes MLAs meet today in Chennai

సీఎం ఎడప్పాడి పళనిసామి నిర్వహిస్తున్న అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి తాము హాజరుకామని టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేల నాయకుడు తంగ తమిళ సెల్వన్ బహిరంగంగా మీడియాకు చెప్పారు. ఇప్పటికే దినకరన్ గ్రూప్ లోని ఐదు మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరీలోని రిసార్ట్ నుంచి గోడ దూకేశారు.

మన్నార్ గుడి మాఫియా ఫ్యామిలీ ఫైట్: ఎమ్మెల్యేలు జంప్ కావడానికి ఆయనే కారణం!మన్నార్ గుడి మాఫియా ఫ్యామిలీ ఫైట్: ఎమ్మెల్యేలు జంప్ కావడానికి ఆయనే కారణం!

దినకరన్ క్యాంప్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలను సమావేశానికి రప్పించాలని సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పలువురు మంత్రులకు ఆ బాధ్యతలు అప్పగించారు. దినకరన్ వర్గంలోని మరికొందరు ఎమ్మెల్యేలకు గాలం వేసి మెజరిటీ నిరూపించుకోవాలని పళనిసామి, పన్నీర్ సెల్వం పావులు కదుపుతున్నారు.

English summary
AIADMK has convened a crucial meeting of the MLAs legislators on today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X