చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత ఆరోగ్యం: కొట్టుకున్న డీఎంకే, అన్నాడీఎంకే నాయకులు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషయమై అన్నాడీఎంకే, డీఎంకే పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. కోయంబత్తూరులో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో అన్నాడీఎంకే కౌన్సిలర్ జేమ్స్ రాజ్, డీఎంకే కార్యకర్త లింగదురై గాయపడ్డారు. వీళ్లిద్దరూ గొడవపడటమే కాకుండా పరస్పరం కొట్టుకున్నారు.

AIADMK-DMK workers fight over CM Jayalalithaa's health condition

గాయాలపాలైన వీరిద్దరూ పొలాచి ఆసుపత్రిలో చేరారు. మద్యం సేవించి ఉన్న లింగదురై జయలలిత ఆరోగ్యంపై గత రాత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న జేమ్స్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు. దీంతో, వారిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అది ఘర్షణకు దారి తీసింది.

వీళ్లిద్దరూ పరస్పరం దాడి జరిగిందంటూ ఫిర్యాదులు చేసుకున్నారని, పొలాచి ఆసుపత్రిలో చేరారని పోలీసులు తెలిపారు. కౌన్సిలర్‌ తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ లింగుదురై పొలాచి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా, కౌన్సిలర్‌ జేమ్స్‌ కూడా లింగుదురై తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ అదే ఆస్పత్రిలో చేరాడు.

English summary
An AIADMK councillor and DMK worker have been admitted to a hospital in Pollachi in the district after they came to blows following an altercation over the remarks on the health status of Tamil Nadu Chief Minister Jayalalithaa, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X