పంతం నెగ్గించుకున్న పన్నీర్ సెల్వం, జయ ఆర్ కే నగర్ లో ఆయనే పోటీ, సీఎంకు !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి 27 మంది నాయకులు ఆర్ కే నగర్ టిక్కెట్ కోసం పోటీ పోటీపడ్డారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు ఆర్ కే నగర్ టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. అయితే గురువారం రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో చర్చలు జరిపిన పళనిస్వామి, పన్నీర్ సెల్వం అమ్మ ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ నియోజక వర్గంలో మధుసూదనన్ తో పోటీ చేయించాలని నిర్ణయించారు.

మొదటి నుంచి మధుసూదనన్ ఆర్ కే నగర్ అభ్యర్థి అంటూ పన్నీర్ సెల్వం పట్టుబడుతూ వచ్చారు. మధుసూదనన్ కు ఆర్ కే నగర్ టిక్కెట్ ఇవ్వకూడదని కొందరు మంత్రులు అభ్యంతరం చెప్పారు. అయితే పన్నీర్ సెల్వం పట్టుబట్టి పార్టీ పెద్దాయన మధుసూదనన్ కు టిక్కెట్టు ఇవ్వాలని వాదించారు.
చివరికి మధుసూదనన్ పేరు ఖరారు చేస్తూ సీఎం పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా మధుసూదనన్ ను పన్నీర్ సెల్వంతో పాటు పలువురు అభినందించారు. అన్నాడీఎంకే పార్టీ ఓట్లు చీల్చడానికి ఆ పార్టీ మాజీ నాయకుడు టీటీవీ దినకరన్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. డీఎంకే పార్టీ సీయర్ నేత మరదు గణేష్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల బరిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications