వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటాపోటీ :కేంద్రానికి శశికళ మరో లేఖ

జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ప్రధానమంత్రి మోడీకి అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ లేఖ రాశారు. అవసరమైతే ఆర్డినెన్స్ ను తీసుకురావాలని ఆమె ప్రధానిని కోరారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :జల్లి కట్టును నిషేధం పై తమిళనాడులో అధికార, విపక్ష పార్టీల మద్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం సాగుతోంది. ఈ క్రీడపై నిషేధానికి మీరంటే మీరే కారణమని ఆరోపణలు ,ప్రత్యారోపణలు చేసుకొంటున్నారు.ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు రెండు ద్రవిడ పార్టీలుే ప్రయత్నిస్తున్నాయి.

జల్లికట్టుపై నిషేధం పై అన్నా డిఎంకె,డిఎంకె పార్టీలు రాజకీయంగా ఆయుధంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆటపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని రెండు పార్టీలు పోటీలు పడికోరుతున్నాయి.

సంక్రాంతి పర్యదినం సందర్భంగా మరోసారి ఈ క్రీడ పై నిషేధం అంశాన్ని ఈ రెండు పార్టీలు ప్రచారానికి వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి.అయితే ఈ అంశం ఏ పార్టీకి రాజకీయంగా కలిసి వస్తోందో మాత్రం ఇప్పటికిప్పుడే చెప్పలేం.

జల్లి కట్టు తమిళనాడు లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆటను సుప్రీం కోర్టు నిషేధం విధించింది. ఈ ఆటపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఈ రెండు పార్టీలు కోరుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలన్నీ ఈ ఆట చుట్టూనే తిరుగుతున్నాయి.

జల్లికట్టుపై ద్రవిడ పార్టీల మాటల యుద్దం

జల్లికట్టుపై ద్రవిడ పార్టీల మాటల యుద్దం

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడులోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో జల్లి కట్టు ఆడతారు. ఈ ఆటకు విపరీతమైన క్రేజీ ఉంటుంది.అయితే ఈ క్రేజీ ఆధారంగా రాజకీయ పార్టీలు ఈ ఆటకు అంతే ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే యూపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలోనే జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆనాటి నుండి జల్లి కట్టును తమిళనాడులో నిర్వహించడం లేదు.

రాజకీయ అస్త్రమైన జల్లికట్టు నిషేధం

రాజకీయ అస్త్రమైన జల్లికట్టు నిషేధం

ఇటీవల కాలంలో మరోసారి జల్లికట్టు పై నిషేధం ఎత్తివేయాలనే డిమాండ్ ను తమిళనాడులోని అధికార, విపక్షాలు చేస్తున్నాయి. డిఎంకె పార్టీ సర్వసభ్యసమావేశం సందర్భంగా పార్టీ ఈ మేరకు ఓ తీర్మాణాన్ని చేసింది.అయితే ఈ మేరకు జల్లి కట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ తీర్మాణం చేసింది. ఇదే సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన స్టాలిన్ ను అన్నాడిఎంకె పార్టీ జల్లికట్టుపై నిషేధానికి కారణమని ఆరోపణలు చేశారు.అయితే ఆనాడు యూపిఏ ప్రభుత్వంలో డిఎంకె అధికారంలో ఉంది. దరిమిలా యూపిఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డిఎంకె నే దీనికి కారణమని అన్నాడిఎంకె ప్రత్యారోపణలు చేసింది.

ప్రధానికి లేఖ రాసిన శశికళ నటరాజన్

ప్రధానికి లేఖ రాసిన శశికళ నటరాజన్

జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ ను తీసుకురావాలని ఆమె ఆ లేఖలో ప్రధానిని కోరారు.తమిళ ప్రజల సంప్రదాయ ఆటల్లో జల్లికట్టు భాగమని ఆమె గుర్తుచేశారు. ఈ విషయమై ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు.తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడ ఈ విషయమై ప్రధానికి లేఖ రాశాడు. అన్నాడిఎంకె ఎంపిలు, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవేను కలిసి జల్లికట్టుకు అనుమతివ్వాలని కోరారు. ఈ విషయమై ప్రధానమంత్రిని కలిసేందుకు కూడ అన్నాడిఎంకె ఎంపిలు ప్రయత్నిస్తున్నారు.

పొంగల్ కు సెలవును ప్రకటించిన కేంద్రం

పొంగల్ కు సెలవును ప్రకటించిన కేంద్రం

పొంగల్ పండుగను తమిళనాడులో పెద్ద ఎత్తున నిర్వహించుకొంటారు.అయితే ఈ పండుగకు సెలవు విషయమై కేంద్రాన్ని అన్నాడిఎంకె కోరింది. ఈ మేరకు అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ప్రధానమంత్రి మోడీకి ఇటీవలే లేఖ రాసింది. ఈ మేరకు పొంగల్ కు సెలవును ప్రకటించింది కేంద్రం. ఈ సానుకూల పరిణామంతో మరోసారి ప్రధానికి శశికళ లేఖ రాసింది. ఈ దఫా జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రాన్ని ఆమె కోరింది.

English summary
aiadmk general secretary sasikala natarajan wrote a letter to prime minister modi, she urges to prime minister lift the ban on jallikattu .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X