పన్నీర్ సెల్వం: రాజీనామాల ముఖ్యమంత్రి ,నాడు అమ్మకోసం, నేడు చిన్నమ్మకోసం

పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. శశికళ అన్నాడిఎంకె శాసనసభపక్ష నేతగా ఎన్నికయ్యారు. సెల్వం స్థానంలో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోసారి తన పదవికి రాజీనామా చేశారు. అమ్మ బతికున్న కాలంలో ఆమెకు విధేయంగా ఉన్న సెల్వం, ఆమె కోరినప్పుడల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.అంతేకాదు రాజీనామా సమర్పించారు.తాజాగా శశికళ కోసం ఆయన తన ముఖ్యమంత్రి పదవిని వదులుకొన్నారు.

తమిళనాడు రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. అన్నాడిఎంకె శాసనసభపక్ష సమావేశంలో శశికళను శాసనసభపక్ష నాయకురాలిగా ఎన్నుకొన్నారు.అయితే పన్నీర్ సెల్వం రాజీనామా చేయనున్నారు. సెల్వం స్థానంలో శశికళ ముఖ్యమంత్రిగా బాద్యతలను చేపట్టనున్నారు.

దివంగత జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆమెకు విశ్వాసపాత్రుడిగా పన్నీర్ సెల్వం కొనసాగారు. అయితే తాను ఏదేని కారణాలతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోవల్సి వస్తే సెల్వం కు ఆమె బాధ్యతలను అప్పగించింది.

జయలలిత రెండు దఫాలు ముఖ్యమంత్రిగా బాద్యతలను కోల్పోవల్సి వచ్చింది. దీంతో ఆమె స్థానంలో పన్నీర్ సెల్వం బాధ్యతలను నిర్వహించారు. ఆమెకు విశ్వాసంగా సెల్వం వైపే ఆమె మొగ్గుచూపారు.

 ముఖ్యమంత్రి పదవికి మరోసారి రాజీనామా చేసిన సెల్వం

ముఖ్యమంత్రి పదవికి మరోసారి రాజీనామా చేసిన సెల్వం

జయలలిత మరణంతో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాద్యతలను స్వీకరించారు. జయకు అత్యంత విశ్వాసంగా ఉన్న పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాద్యతలను స్వీకరించి ఎక్కువ కాలం ఈ పదవిలో ఉండలేదు. అంతేకాదు జయ మరణించిన తర్వాత సెల్వం ముఖ్యమంత్రి పదవికి ఇప్పటికిప్పుడే వచ్చిన ముప్పేమీ లేదని భావించినా...చివరకు సెల్వం రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.

 పార్టీని గుప్పిట్లోకి తీసుకొన్న శశికళ

పార్టీని గుప్పిట్లోకి తీసుకొన్న శశికళ

అన్నాడిఎంకె పార్టీని తన గుప్పిట్లోకి తీసుకొన్నారు శశికళ. జయలలిత మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. శశికళ ఈ పదవిని చేపట్టకుండా అడ్డుకొనే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఆమెను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడమే కాదు, ఎన్నికల వ్యవహరాలనే ఆమె చేసుకొనేలా పార్టీ నిబంధనవళిలో మార్పులు చేశారు. అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకొన్న తర్వాత ఆమె జిల్లాల నాయకులతో సమీక్షలు నిర్వహించారు. పార్టీలో సీనియర్లు కూడ ఆమె చెప్పినట్టే నడుచుకొన్నారు. పార్టీలో తిరుగులేని ఆధిపత్యాన్ని అనతికాలంలోనే ఆమె సాధించారు.వ్యూహత్మకంగా అడుగులువేస్తూ ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్నారు.

 పన్నీర్ సెల్వం కొద్దినెలలపాటే ముఖ్యమంత్రి

పన్నీర్ సెల్వం కొద్దినెలలపాటే ముఖ్యమంత్రి

జయలలిత రెండు దఫాలు కోర్టు కేసుల కారణంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ సమయంలో పన్నీర్ సెల్వం ఈ బాధ్యతలను స్వీకరించారు. 2001 లో తాన్సీ కేసులో జయలలిత ముఖ్యమంత్రి పదవిని కోల్పోవల్సి వచ్చింది.ఈ కేసు తీర్పుతో ముఖ్యమంత్రిగా బాద్యతలను ఆమె పన్నీర్ సెల్వం కు అప్పగించారు. మరో వైపు 2014 సెప్టెంబర్ లో కూడ ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ఆమె తన పదవిని కోల్పోవల్సి వచ్చింది.ఆ సమయంలో కూడ ఆమె పన్నీర్ కు బాద్యతలను కట్టబెట్టారు.2015 మే 11న, కోర్టు తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది.దీంతో ఆమె తిరిగి సిఎం బాధ్యతలను చేపట్టారు.

 శశికళ కోసం ముఖ్యమంత్రి పదవి త్యాగం

శశికళ కోసం ముఖ్యమంత్రి పదవి త్యాగం

జయ మరణం తర్వాత అర్థరాత్రి పూట పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించారు.అయితే పన్నీర్ సెల్వం బాద్యతలు స్వీకరించిన తర్వాత శశికళ పార్టీపై పట్టుపెంచుకొన్నారు. ఈ మేరకు పార్టీ పగ్గాలు స్వీకరించిన తర్వాత, తిరిగి ఆమె ప్రభుత్వం పై గురిపెట్టారు. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ కూడ శశికళ చెప్పినట్టుగానే పాలన సాగుతున్న పరిస్థితి కన్పించింది. చివరికి పార్టీ శాసనసభపక్ష నాయకురాలిగా ఆమె ఎన్నికయ్యారు.దీంతో ఆమె కోసం పన్నీర్ సెల్వం రాజీనామా చేయాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+