శశికళకు సినిమానే: ఇవ్వమంటే ఇవ్వం: ఏం చేద్దాం అంటూ చిన్నమ్మ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు/చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు చుక్కెదురు అయ్యింది. తనకు పెరోల్ ఇవ్వాలని శశికళ పెట్టుకున్న అర్జీని న్యాయస్థానం తిరస్కరించిందని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు తెలిపారు.

తనకు పెరోల్ ఇవ్వాలని శశికళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే శశికళకు పెరోల్ ఇవ్వడానికి నియమాలు అంగీకరించవని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాదులు కోర్టులో అభ్యంతరం వ్యక్యం చేశారు.

AIADMK Interim General Secretary Sasikala's Parole plea was rejected by Bengaluru prison officials.

ఈ సందర్బంలో శశికళకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఎలాగైనా పెరోల్ మంజూరు చెయ్యాలని శశికళ న్యాయవాదులు న్యాయస్థానంలో మనవి చేశారు. అయితే శశికళకు పెరోల్ మంజూరు చెయ్యకుండా కర్ణాటక న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎలాగైనా బయటకు వచ్చి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న శశికళకు కర్ణాటక ప్రభుత్వ న్యాయవాదులు కళ్లెం వేస్తున్నారు. జైలులో అడుగు పెట్టి ఆరు నెలలు కాకుండానే శశికళకు ఏవిధంగా పెరోల్ ఇస్తారు అంటూ కర్ణాటక న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengaluru: AIADMK Interim General Secretary Sasikala Natarajan's Parole plea was rejected by Bengaluru prison officials.
Please Wait while comments are loading...