వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: డీఎంకే, అన్నాడీఎంకే చట్టాపట్టాలు, ఎందుకంటే ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎం. కరుణానిధిని పరామర్శించడానికి అన్నాడీఎంకే నేతలు తంబిదురై, డి, జయకుమార్ చెన్నైలోని అళ్వార్ పేటలోని కావేరీ ఆసుపత్రికి వెళ్లి వచ్చిన విషయం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కొత్తపరిణామం అంటున్నారు.

తమిళనాడులో రాజకీయాల తీరు మారుతుందా? అంటే ఔను అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిన్నటి వరకు పరస్పరం విమర్శలు, ఆరోపణలతో నిప్పులు చెరుగుకున్న అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

AIADMK leaders enquire about M Karunanidi’s health in hospital in Chennai

కరుణానిధి హెల్ల్ బులినెట్ ఇదే: చికిత్స ఇలా (వీడియో)కరుణానిధి హెల్ల్ బులినెట్ ఇదే: చికిత్స ఇలా (వీడియో)

అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయని దేశం మొత్తం తెలిసిందే. పై స్థాయి నేతలే కాదు, కార్యకర్తలు కూడా ప్రత్యర్థి పార్టీపై ఇదే స్థాయిలో వైరం పెంచుకున్నారు.

ఎంజీఆర్ సీఎంగా ఉన్నంత వరకు శాసన సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తంగా చర్చలు జరిగాయి. బయట మాత్రం ఇరు పార్టీల నాయకులు కలిసిసోయేవారు. అయితే 1991లో జయలలిత సీఎం అయిన తరువాత పరిస్థితి మారిపోయింది.

జయలలిత సీఎం అయిన తరువాత ఇరు పార్టీల నాయకుల మధ్య మాటలు కాని, పరామర్శలు కాని లేవు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల నాయకులు ఎదురు పడితే ముఖాలు తిప్పుకుని వెళ్లిపోవాల్సిందే.

నాయకులే కాదు తమిళనాడులో ఇరు పార్టీల కార్యకర్తలు సైతం ఇదే సాంప్రధాయాన్ని పాటించారు. ఎవరైనా ప్రత్యర్థి పార్టీ వారితో మాట్లాడినా, వారితో సంబంధాలు పెట్టుకున్నట్లు తెలిసినా తీవ్రపరిణామాలు ఎదుర్కొన్నారు.

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న తంబిదురై 2012లో తన కుమార్తె లాస్య పెళ్లికి కూడా వెళ్లలేదు. అందుకు కారణం శాసన సభలో ప్రతిపక్షం పార్టీ వైపు కుర్చున్న కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు జ్ఞానశేఖర్ కుమారుడు నవీన్ ను లాస్య పెళ్లి చేసుకోవడం.

AIADMK leaders enquire about M Karunanidi’s health in hospital in Chennai

పెళ్లికి తండ్రి తంబిదురైని ఒప్పించడానికి లాస్య తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. అయితే తంబిదురై అమ్మకు భయపడి లాస్య, నవీన్ పెళ్లికి అంగీకరించలేదు. చివరికి లాస్య జయలలితను కలవడానికి ఏకంగా పోయెస్ గార్డెన్ కు వెళ్లారు.

పోయెస్ గార్డెన్ లోకి లాస్యను జయలలిత అనుమతించలేదు. అక్కడి నుంచి వెనుతిరిగిన లాస్య చివరికి తిరుమలలో నవీన్ ను పెళ్లి చేసుకున్నారు. కుమార్తె లాస్య పెళ్లికి కూడా వెళ్లకుండా అమ్మ భక్తిని చాటుకున్న తంబిదురై ఇప్పుడు కావేరీ ఆసుపత్రి చేరుకుని కరుణానిధిని పరామర్శించడంతో తమిళనాడులో పెద్ద చర్చకు దారి తీసింది.

చిన్నమ్మ శశికళ చెబితే తాము వచ్చి కరుణానిధిని పరామర్శించామని తంబిదురై మీడియాకు చెప్పారు. కొంత కాలం క్రితం అమ్మ జయలలిత తన తీరుమార్చుకున్నారు. 2016 శాసన సభ ఎన్నికల్లో గెలిచి అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత జయలలిత తన తీరును మార్చుకున్నారు.

డీఎంకే చీఫ్ గా స్టాలిన్ ! అన్నాడీఎంకేకి షాక్డీఎంకే చీఫ్ గా స్టాలిన్ ! అన్నాడీఎంకేకి షాక్

సీఎంగా ఉన్న జయలలిత, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ఒకరికోకరు అభివాదం చేసుకున్నారు. జయలలిత, స్టాలిన్ ఎప్పుడు ఎదురు పడినా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. 2016లో జయలలిత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ కు సముచిత స్థానం కల్పించలేదని ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయంపై జయలలిత సానుకూలంగానే స్పందించారు. వెంటనే ఈ విషయం తన దృష్టికి తీసుకు వస్తే ఇలా జరిగేది కాదని జయలలిత విచారం వ్యక్తం చేశారు. జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో స్టాలిన్, కురుణానిధి సతీమణి, డీఎంకే సీనియర్ నాయకులు అపోలో ఆసుపత్రి చేరుకుని అన్నాడీఎంకే నాయకులను పరామర్శించారు.

తమ మధ్య సిద్దాంతపరమైన విభేదాలు మాత్రమే ఉన్నాయని కరుణానిధి సైతం తన సామాజిక మాధ్యమాల్లో ప్రకటిస్తూ జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇప్పుడు అన్నాడీఎంకే నాయకుల తీరు మారడంతో తమిళనాడులో రాజకీయ నాగరికత చిగురిస్తోందని పలువురు నేతలు అంటున్నారు.

English summary
AIADMK leaders M Thambidurai and Jayakumar visited the Kauvery Hospital in Chennai where DMK chief Karunanidhi is undergoing treatment and enquired about the health of the nonagenarian leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X