ట్విస్ట్: ఆ పదవి కోసం పన్నీరుసెల్వం, అక్కడే చిక్కు వచ్చింది

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గాల విలీన అంశం ఇంకా కొనసాగుతోంది. శశికళను, ఆమె కుటుంబాన్ని పార్టీ పదవుల నుంచి తొలగించారు.

ఇరువర్గాలు ఒక్కటి కావాలంటే.. అంటూ పళనిస్వామి ఎదుట పన్నీరుసెల్వం పలు డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లను దాదాపు నెరవేర్చారు.

పళనిస్వామికి షాక్ మీద షాక్ ఇస్తున్న పన్నీరుసెల్వం

AIADMK merger: Here are the terms proposed by Panneerselvam and Palanisami camps

శశికళ, దికరన్‌లను పదవి నుంచి తప్పించడం, పన్నీరుసెల్వంకు ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇవ్వడం తదితర డిమాండ్లకు పళని ఓకే చెప్పారు. అదే సమయంలో తనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని కూడా పన్నీరు చెప్పారు.

ఇక్కడే చిక్కు వచ్చి పడిందని అంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి మీద మరో సీనియర్ నేత సెంగొట్టియన్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పదవిని పన్నీరుసెల్వానికి ఇస్తే... అనే డైలమాలో సెంగొట్టియన్ ఉన్నారు. ఇక్కడ కూడా చిక్కు వచ్చి పడిందని, చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Here are the terms proposed by Panneerselvam and Palanisami camps.
Please Wait while comments are loading...