మద్యం, డబ్బు పంపిణి, అడ్డంగా బుక్కైన అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే, ఆర్ కే నగర్ లో !

Posted By:
Subscribe to Oneindia Telugu
AIADMK MLA Distributes Money And Liquor To Cadres : Video Viral | Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే మద్యం, డబ్బు పంచిపెడుతూ అడ్డంగా బుక్కయిపోయా డు. డబ్బు, మద్యం పంపిణి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ కావటంతో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే కనకరాజ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

 ఎంజీఆర్ శత జయంతి వేడుకలు !

ఎంజీఆర్ శత జయంతి వేడుకలు !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ శత జయంతి ఉత్సవాలను కోయంబత్తూరులో అన్నాడీఎంకే పార్టీ ఆదివారం ఘనంగా నిర్వహించింది. ఎంజీఆర్ శత జయంతి వేడుకలకు జనాలను సమీకరించేందుకు అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే ఆర్‌. కనకరాజ్‌ భారీ మొత్తంలో మద్యం, డబ్బు పంచిపెట్టారని ఆరోపణలు వస్తున్నాయి.

 70 బస్సులు, రూ. 2 వేల నోట్లు !

70 బస్సులు, రూ. 2 వేల నోట్లు !

ఎంజీఆర్ శత జయంతి వేడుకల కార్యక్రమానికి దాదాపు 70 బస్సుల్లో ఆయన స్థానిక ప్రజలను తరలించారని సమాచారం. ఆక్రమంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. కుర్చీలో కుర్చున్న ఎమ్మెల్యే కనకరాజ్ రూ. 2 వేల నోట్లు లెక్కడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

బుక్కులో లెక్కలు, మద్యం బాక్సులు

బుక్కులో లెక్కలు, మద్యం బాక్సులు

అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే కనకరాజ్ పక్కనే నిలబడిన ఓ వ్యక్తి బుక్కులో ఎవరెవరికి ఎంత డబ్బు ఇస్తున్నాము అంటూ లెక్కలు రాసుకుంటున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే కనకరాజ్ పక్కనే మద్యం బాటిళ్లు కాటన్‌ డబ్బాల్లో ప్యాక్‌ చేసి ఉండటం కనిపిస్తోంది.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ?

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ?

ఆర్ కే నగర్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే కనకరాజ్ ప్రజలను ప్రలోభపెడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే కనకరాజ్‌ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఎంజీఆర్‌ శత జయంతి వేడుకల కోసం వేదిక వద్దకు వచ్చే కార్యకర్తల సౌకర్యార్థం తాను డబ్బును కేటాయించామని అంటున్నారు.

మద్యం కాదు భోజనం !

మద్యం కాదు భోజనం !

ప్రజలకు పంచిపెట్టడానికి కాటన్ డబ్బాల్లో భోజనం ఉందని ఎమ్మెల్యే కనకరాజ్ చెబుతున్నారు. తమిళ ప్రజలు మద్యం, డబ్బుకు తల వంచే రకం కాదని, ఆర్ కే నగర్‌ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీనే విజయం సాధిస్తోందని ఎమ్మెల్యే కనకరాజ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK MLA booked distributing monet and liquor in Tanil Nadu
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి