వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు రిసార్ట్ ఎమ్మెల్యేల షాక్: జయలలితకు భారతరత్న లేనట్లే!

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గోల్డెన్ బే రిసార్టు వద్ద మంగళవారం అర్ధరాత్రి దాకా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గోల్డెన్ బే రిసార్టు వద్ద మంగళవారం అర్ధరాత్రి దాకా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

రిసార్టును ఖాళీ చేయాలని పోలీసులు సూచించిన నేపథ్యంలో గత రాత్రి పలువురు ప్రజాప్రతినిధులు రిసార్టును ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో సగం మంది ఎమ్మెల్యేలకు పైగా రాత్రి రిసార్టును వదిలి ఇళ్లకు చేరుకున్నారు.

ఎంట్రీ: శశికళకు చెక్, పన్నీరు వర్గంలో చేరిన దీపా: అద్భుతం జరిగితేనే..ఎంట్రీ: శశికళకు చెక్, పన్నీరు వర్గంలో చేరిన దీపా: అద్భుతం జరిగితేనే..

మిగిలిన ఎమ్మెల్యేలు ఇంకా రిసార్టులోనే ఉన్నారు. వారిలో బుధవారం అయిదుగురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారని తెలుస్తోంది. వారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గంలో చేరనున్నారని తెలుస్తోంది.

AIADMK MLA Walks Out of Resort During Sasikala Visit, Joins Team OPS

అన్నాడీఎంకేలో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. శశికళకు జైలు శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన అనంతరం చిన్నమ్మ.. పళనిస్వామిని అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ప్రకటించారు. కోర్టులో లొంగిపోయే ముందు దినకరన్‌కు పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆయనను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరిగా నియమించారు.

అమ్మకు భారతరత్న లేనట్లే!

జయలలితకు భారతరత్న ప్రకటించే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయంటున్నారు. ఇదే సమయంలో ఆ పార్టీ నేతలు పన్నీర్ సెల్వం తదితరులు కోరినట్టుగా పార్లమెంటులో విగ్రహం, చిత్రపటం ఏర్పాటు చేసే అవకాశాలూ లేవని అభిప్రాయపడుతున్నారు.

కోర్టులో లొంగిపోయేందుకు రోడ్డు మార్గంలో బెంగళూరుకు శశికళకోర్టులో లొంగిపోయేందుకు రోడ్డు మార్గంలో బెంగళూరుకు శశికళ

1996 నాటి అక్రమాస్తుల కేసులో, జయలలితతో పాటు నిందితులను దోషులుగా సుప్రీం కోర్టు నిర్థారించిన నేపథ్యంలో నేర చరితులకు భారతరత్న ఇవ్వరాదన్న నిబంధనలు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, తమిళ ప్రజల ఆకాంక్షను నెరవేరకుండా చేయనుంది.

English summary
The rebellion by ‘caretaker’ Chief Minister O Panneerselvam against AIADMK leader VK Sasikala grew on Monday with a party parliamentarian and an MLA jumping ship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X