బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళతో భేటీకి ఎమ్మెల్యేలు: పళనిసామికి బుద్ది చెబుతామని !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న శశికళను కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. శశికళను కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చుతామని చిన్నమ్మకు హామీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి టీటీవీ దినకరన్ వర్గంలో ఉన్న 18 మంది అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు కర్ణాటకలోని మడికేరి జిల్లా కొడుగు (కూర్గ్) సమీపంలోని విలాసవంతమైన రిసార్ట్ లో బస చేశారు.

AIADMK MLAs from Dinakaran faction plans to meet Sasikala

రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఆదివారం బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న శశికళను సోమవారం ములాఖత్ లో కలుసుకోవడానికి ముగ్గురు ఎమ్మెల్యేలు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులకు అర్జీ సమర్పించారు.

శశికళ ఎంతగానో నమ్మి ముఖ్యమంత్రిని చేసిన ఎడప్పాడి పళనిసామి చివరికి పన్నీర్ సెల్వంతో చేతులు కలిపి శశికళ, టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని ప్రయత్నిస్తున్నారని మన్నార్ గుడి మాఫియా ఆరోపిస్తోంది. ఈ సందర్బంలో చిన్నమ్మ శశికళను అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు భేటీ కావాలని ప్రయత్నిస్తుడంటం కొసమెరుపు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK MLAs from Dinakaran faction plans to meet Sasikala on tomorrow, says sources.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X