మైనారిటీలో తమిళనాడు ప్రభుత్వం: 12 మంది ఎమ్మెల్యేలు మాయం, పళని, పన్నీర్ !

Posted By:
Subscribe to Oneindia Telugu
పళని, పన్నీర్ కు పెద్ద షాక్ ! 12 మంది ఎమ్మెల్యేలు మాయం..

చెన్నై: తమిళనాడులో ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం బలపరీక్షకు సిద్దం అయితే మెజారిటీ శాసన సభ్యులు ఎంత మంది మద్దతు ఇస్తారు ? అనే ప్రశ్న మొదలైయ్యింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు టీటీవీ దినకరన్ విజయం సాధించిన తరువాత ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు బుధవారం భేటీ అయ్యారు. మనవైపు ఎంత మంది శాసన సభ్యులు ఉన్నారు పళనిస్వామి, పన్నీర్ సెల్వం లెక్కలు వేసుకోవడంతో 12 మంది మాయం అయ్యారని వెలుగు చూసింది.

 టీటీవీ దినకరన్ దెబ్బ !

టీటీవీ దినకరన్ దెబ్బ !

అమ్మ జయలలిత ప్రాతినిధ్యం వహించి ఆమె మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ శాసన సభ ఉప ఎన్నికల్లో తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీలకు సినిమా చూపించిన టీటీవీ దినకరన్ విజయం సాధించారు.

పళని, పన్నీర్ అలర్ట్

పళని, పన్నీర్ అలర్ట్

చెన్నైలోని రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. అన్నాడీఎంకే పార్టీ చీఫ్ కో ఆర్డినేటర్ పన్నీర్ సెల్వం, కో ఆర్డినేటర్ ఎడప్పాడి పళనిస్వామి అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు.

 జనవరి 8వ తేదీ

జనవరి 8వ తేదీ

జనవరి 8వ తేదీ నుంచి తమిళనాడు శాసన సభ సమావేశాలు జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్బంలో తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న టీటీవీ దినకరన్ ప్రతిపక్షం డీఎంకేతో కలిసి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి మెజారిటీ శాసన సభ్యుల మద్దతు లేదని, బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.

టీటీవీ తిక్క మాటలు

టీటీవీ తిక్క మాటలు

శాసన సభ సమావేశాల్లో టీటీవీ దినకరన్ మన ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే సరైన రీతిలో తిప్పికోట్టాలని ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం మంత్రులు, శాసన సభ్యులకు సూచించారు దినకరన్ తిక్క మాటలకు నోరుజారి మాట్లాడి మన స్థాయిని తగ్గించుకోరాదని సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం సూచించారు.

అయోమయం !

అయోమయం !

బుధవారం జరిగిన అన్నాడీఎంకే శాసన సభ్యుల సమావేశానికి 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనారు. తమకు 116 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని ఇన్ని రోజులు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.

ఒక్క రోజు ముందే షాక్

ఒక్క రోజు ముందే షాక్

కరూరు జిల్లాలోని క్రిష్ణరాయపురం శాసన సభ నియోజక వర్గం నుంచి అన్నాడీఎంకే పార్టీ గుర్తుతో పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే గీతా మంగళవారం తాను టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్నానని బాంబు పేల్చారు. మరుసటి రోజు బుధవారం జరిగిన సమావేశానికి గీతాతో సహ 12 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.

మైనారిటీలో ప్రభుత్వం ?

మైనారిటీలో ప్రభుత్వం ?

స్పీకర్ ధనపాల్ తో కలుపుకుంటే తమకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పిన పళనిస్వామి, పన్నీర్ సెల్వం బుధవారం అయోమయంలో పడిపోయారు. సమావేశానికి హాజరుకావాలని ముందుగా సమాచారం ఇచ్చినా ఎమ్మెల్యేలు ఎందుకు హాజరుకాలేదని ఆరా తీశారు.

క్లారిటీ ఇచ్చిన మంత్రి

క్లారిటీ ఇచ్చిన మంత్రి

శాసన సభ్యుల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళనాడు సీనియర్ మంత్రి జయకుమార్ శబరిమలకు కొందరు, వ్యక్తిగత పనులపై కొందరు, ప్రభుత్వ కార్యక్రమాలకు కొందరు ఎమ్మెలు వెళ్లారని, అందుకే ఈ రోజు జరిగిన సమావేశానికి రాలేకపోయారని, ప్రభుత్వానికి ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని మంత్రి జయకుమార్ వివరణ ఇచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The AIADMK MLAs, who are supporting Chief Minister Edappadi Palanisamy faction, have reduced to 104. AIADMK government lost its majority?
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి