Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉచితంగా భార్యలు: ఏఐఏడీఎంకే నేత సంచలనం!

AIADMK leader shocker: ఏఐఏడీఎంకే మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం మహిళలను ప్రభుత్వ ఉచిత పథకాలతో పోలుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శల పాలయ్యారు. ఓట్ల కోసం స్టాలిన్ ఉచితంగా భార్యను కూడా ఇవ్వవచ్చని వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే బూత్ కమిటీ శిక్షణా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, "ఎన్నికల కోసం చాలా ప్రకటనలు వస్తాయి. ఉచితంగా మిక్సర్లు, గ్రైండర్లు, మేకలు, ఆవులు ఇస్తారు.. అంతేకాదు ప్రతి వ్యక్తికి ఉచితంగా ఒక భార్యను కూడా ఇవ్వవచ్చు" అని వ్యాఖ్యానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కరుణానిధి కొడుకు కాబట్టి అలాంటి వాగ్దానాలు చేయగల సామర్థ్యం అతనికి ఉందని కూడా షణ్ముగం అన్నారు.

డీఎంకే నుంచి తీవ్ర ఖండన
ఈ వ్యాఖ్యలను డీఎంకే తీవ్రంగా ఖండించింది. షణ్ముగం వ్యాఖ్యలపై డీఎంకే ఎక్స్ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో మంత్రి తిరుమిగు గీతా జీవన్ స్పందించారు. షణ్ముగం మహిళలను కించపరిచారని మండిపడ్డారు. ఆయన కామెంట్స్ మహిళల పట్ల ఏఐఏడీఎంకే వికృతత్వాన్ని, దురుద్దేశాన్ని" బయటపెట్టాయని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను ఆమె ఈ సందర్భంగా హైలైట్ చేశారు. విడియల్ పయనం (ఉచిత బస్సు ప్రయాణం), కలైంజర్ మహిళా హక్కుల పథకం, పుదుమై పెణ్ పథకం పనిచేసే మహిళల కోసం తోజి హాస్టల్స్ వంటి పథకాలను మహిళల కోసం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

AIADMK MP CV Shanmugam Sparks Outrage with Controversial Free Wives Comment

మహిళా స్వయం సహాయక బృందాలకు రుణ పరిమితి పెంచే కార్యక్రమాలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. షణ్ముగం మహిళా వర్గాన్ని కించపరిచారని గీతా జీవన్ మండిపడ్డారు. జయలలిత బతికి ఉన్నప్పుడు షణ్ముగం ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండేవారా అని ప్రశ్నించిన ఆమె.. ఎడప్పాడి పళనిసామి ఈ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని నిలదీశారు.

గతంలోనూ మహిళా పథకాలపై విమర్శలు
గతంలో ఏఐఏడీఎంకే నాయకులు మహిళల సంక్షేమ పథకాలను కించపరిచిన సందర్భాలను కూడా గీతా జీవన్ గుర్తు చేశారు: పళనిసామి విడియల్ పయనం బస్సులను "లిప్‌స్టిక్ పూసిన బస్సులు" అని పిలిచారని ఆమె తెలిపారు.నటి ఖుష్బూ మహిళా హక్కుల పథకం కింద ఇచ్చే మొత్తాన్ని "భిక్షాటన" అని అభివర్ణించినట్లు చెప్పుకొచ్చారు.పీఎంకే నాయకురాలు సౌమ్య అంబుమణి మహిళలకు అందించే రూ.1,000 సహాయాన్ని ఎగతాళి చేశారని గుర్తు చేశారు. .

స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడు ప్రగతిశీల పథకాలను అమలు చేసిందని, ఇది మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, విద్యలో భాగస్వామ్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచిందని డీఎంకే ప్రకటన ద్వారా తెలిపింది. ఈ అభివృద్ధి ఏఐఏడీఎంకేకు నచ్చడం లేదని, అందుకే షణ్ముగం అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆ ప్రకటన పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+