చూస్తే షాక్: అమ్మ కోసమా, చిన్నమ్మ కోసమా: ఏమి ఏడ్చారండి
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మీద ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవం ఇప్పుడు యూటర్న్ అయ్యిందని అనిపిస్తోంది. చిన్నమ్మ ఒక్క కన్నీటి బోట్టు కార్చారని తట్టుకోలేని నాయకులు ఎక్కడలేని ఆవేదన చెంది కళ్లు చెమ్మరిల్లేలా ఏడ్చేశారు.
గురువారం అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరే ఉండాలని నెచ్చెలి శశికళకు పార్టీ నాయకులు మనవి చేశారు. పార్టీ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని, వారు ఆమోదించిన పత్రాలను ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్వయంగా పోయెస్ గార్డెన్ లో శశికళకు అందించారు.

ఆ ఆమోదపత్రాలు స్వీకరించిన శశికళ తరువాత తన ప్రాణస్నేహితురాలు చిత్రపఠానికి పుష్పార్పణ చేసి నివాళులు అర్పించారు. ఆ సమయంలో చిన్నమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే పక్కనే ఉన్న నాయకులు తట్టుకోలేకపోయారు.
జయలలితను గుర్తు చేసుని ఏడ్చారో ? లేక చిన్నమ్మ కంటతడిపెట్టారని తట్టుకోలేకపోయారో తెలీదు కాని ఒక్క సారిగా కళ్లు చెమిరేలా ఏడ్చేశారు. జోబులో ఉన్న చేతిరుమాలు తీసుకుని కళ్లు తుడుచుకుంటూ దర్శనం ఇచ్చారు.












Click it and Unblock the Notifications