వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంగా పళనిస్వామి మున్నాళ్ల ముచ్చటేనా?: తదుపరి సీఎంగా శశికళ అక్క కొడుకే?

సీఎం కుర్చీలో పళనిస్వామిని శశకళ ఎక్కువ రోజులు కూర్చోబెట్టే అవకాశం కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. తన అక్క కుమారుడు దినకరన్‌ను సీఎం సీట్లో కూర్చోబెట్టేందుకు శశికళ .

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా మధ్య బలాన్ని నిరూపించుకుని... పళనిస్వామి సీఎం కూర్చీలో కూర్చున్న విషయం తెలిసిందే. అయితే, ఈయన ముచ్చట మూన్నాళ్లే అని సమాచారం.

వేరే జైలుకు సీరియల్ కిల్లర్ సెనైడ్ మల్లిక: శశికళే కారణమా?వేరే జైలుకు సీరియల్ కిల్లర్ సెనైడ్ మల్లిక: శశికళే కారణమా?

సీఎం కుర్చీలో పళనిస్వామిని శశకళ ఎక్కువ రోజులు కూర్చోబెట్టే అవకాశం కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. తన అక్క కుమారుడు దినకరన్‌ను సీఎం సీట్లో కూర్చోబెట్టేందుకు శశికళ అప్పుడే కార్యాచరణ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

AIADMK's TTV Dinakaran Meets VK Sasikala In Prison

ఈ వాదనకు బలం చేకూర్చేలా అన్నాడీఎంకే దిండుగల్ జిల్లా నలకోట ఎమ్మెల్యే తంగదురై మాట్లాడుతూ.. త్వరలోనే దినకరన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జయలలిత ఉన్నప్పుడే పార్టీ కార్యక్రమాల్లో దినకరన్ చురుగ్గా ఉండేవారని ఆయన అన్నారు.

ఆర్కే నగర్‌పై శశికళ బడా ప్లాన్.. సీఎంగా..: పళనిస్వామికి కూడా చెక్!ఆర్కే నగర్‌పై శశికళ బడా ప్లాన్.. సీఎంగా..: పళనిస్వామికి కూడా చెక్!

తర్వలోనే దినకరణ్ సీఎం అయ్యే తరుణం వస్తుందని చెప్పారు. దీంతో ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి పదవిని కోల్పోయే అవకాశమున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో పళనిస్వామి ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదని పార్టీ శ్రేణులు కూడా అంటుండటం గమనార్హం.

కాగా, అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్న టీటీవీ దినకరణ్ మంగళవారం జైలులో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను కలిశారు. పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యాక దినకరణ్.. శశికళను కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఈ సందర్భంగా శశికళకు దినకరణ్ వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో దినకరణే సీఎం అవుతారంటూ వాదనలు వినిపిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary
AIADMK Deputy General Secretary T T V Dinakaran today met his aunt and party chief V K Sasikala at the central prison in Bengaluru, where she is serving her term in the disproportionate assets case. This was his first meeting with Ms Sasikala after her loyalist E K Palaniswami won the vote of confidence in the Tamil Nadu Assembly on February 18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X