'జయ'పై విష ప్రయోగమా!.. గందరగోళపరుస్తున్నారు,డాక్టర్లా?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిపై విష ప్రయోగం చేశారనేది అవాస్తవమని అన్నాడిఎంకె సీనియర్ నాయకుడు వీఎస్ రామచంద్రన్ చెప్పారు. పాండియన్ సోదరులు పార్టీ కార్యకర్తలను గందరగోళపరుస్తున్నాడని చెప్పారు.
చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితది సహజ మరణం కాదని పీహెచ్ పాండియన్, మనోజ్ పాండియన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమమని అన్నాడిఎంకె సీనియర్ నేత వీఎస్ రామచంద్రన్ చెప్పారు.
జయలలితపై విషప్రయోగం జరిగిందనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఆమెపై విష ప్రయోగం జరిగిందా లేదా అనేది డాక్టర్లు మాత్రమే చెబుతారని ఆయన చెప్పారు.

పాండియన్ సోదరులు పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏదైనా ఉంటే పార్టీ వేదికలపై మాట్లాడుకోవాలని ఆయన సూచించారు.
పాండియన్ కుటుంబానికి చెందిన ఐదుగురు పదవులు అనుభవించి ప్రస్తుతం పార్టీలో చిచ్చుపెడుతున్నారని మరో సీనియర్ నాయకుడు ధ్వజమెత్తారు. శశికళకు వ్యతిరేకంగా పాండియన్ సోదరులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications