జయలలిత ఆసుపత్రి బిల్లు సెటిల్ చేశారు: ఎన్ని రూ. కోట్లు, ఎవరు, ఎందుకు ఇచ్చారు ?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందిన అపోలో ఆసుపత్రికి రూ. 6 కోట్లు బిల్లు చెల్లిస్తున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ చెప్పారు. జయలలిత చికిత్స పొందిన ఆసుపత్రి బిల్లు మేమే చె

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందిన అపోలో ఆసుపత్రికి రూ. 6 కోట్లు బిల్లు చెల్లిస్తున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ చెప్పారు. జయలలిత చికిత్స పొందిన ఆసుపత్రి బిల్లు మేమే చెల్లిస్తామని మంత్రి విజయభాస్కర్ స్పష్టం చేశారు.

గత సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ అర్దరాత్రి అనారోగ్య కారణాలతో జయలలిత చెన్నైలోని గ్రీన్ వేవ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేశారు. అప్పటి నుంచి అక్కడే సింగపూర్, లండన్, ఎయిమ్స్, అపోలో వైద్యులు జయలలితకు చికిత్స అందించారు.

AIADMK settles Rs.6 crore bill towards Jayalalithaa’s hospitalisation

చికిత్స విఫలమై 2016 డిసెంబర్ 5వ తేదీన జయలలిత అపోలో ఆసుపత్రిలోనే మరణించారు. తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జయలలిత చికిత్స పొందుతూ మరణిస్తే ఆసుపత్రి బిల్లు ప్రభుత్వమే భరించే వెసులుబాటు ఉంది.

అయితే అమ్మ చనిపోయిన ఆరు నెలలు పూర్తి అయిన తరువాత జయలలిత ఆసుపత్రి బిల్లు అన్నాడీఎంకే పార్టీనే చెల్లిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రకటించారు. అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తరపున చెక్ ను ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ కు అందించారు. ఇప్పుడు జయలలిత ఆసుపత్రి బిల్లు అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తరపున చెల్లించి మరో చర్చకు, ఇంకో డ్రామాకు తెరతీశారని అమ్మ అభిమానులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+