శశికళ మెట్టు దిగారా: మోడీతో పళని భేటీ వెనుక మద్దతు?
మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం తర్వాత.. బుధవారం ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రపతి ఎన్నికలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రధానితో భేటీ అనంతరం పళనిస్వామి చెప్పారు.
చెన్నై: మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం తర్వాత.. బుధవారం ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రపతి ఎన్నికలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రధానితో భేటీ అనంతరం పళనిస్వామి చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రధానిని కలిసిన కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి కూడా మోడీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ భేటీతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అన్నాడీఎంకే మద్దతివ్వనుందా? ఈ విషయం పైనే చర్చించేందుకు పళనిస్వామి మోడీని కలిశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే దానిపై కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్, తెరాస, బిజు జనతాదళ్ పార్టీలు బిజెపి రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తామని ప్రకటించడం, మద్దతిచ్చే అవకాశాలున్నాయి. జులై నెలలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహించనున్నారు.
కాగా, జయలలిత మృతి అనంతరం తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అన్నాడీఎంకేలోనే పలు గ్రూపులు వచ్చాయి. బీజేపీ దీనిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే శశికళ.. బీజేపీ ప్రయత్నాలను దెబ్బతీసింది. ఆ తర్వాత శశికళ ఆస్తుల కేసులో జైలుకెళ్లడం, ఐటీ దాడుల నేపథ్యంలో.. శశికళ వర్గం సీఎం పళని ప్రధాని మోడీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. శశికళ మెట్టు దిగారా అనే చర్చ సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తే మాత్రం మెట్టు దిగినట్లే అంటున్నారు.












Click it and Unblock the Notifications
