వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత వారసులు ? అక్టోబర్ 5 చెబుతాం: మీకు ఎంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు: ఈసీ !

అన్నాడీఎంకే పార్టీ చిహ్నం రెండాకుల చిహ్నం ఎవ్వరికి ఇవ్వాలి ? అనే విషయం అక్టోబర్ 5వ తేదీ తేల్చేస్తామని భారత ఎన్నికల కమిషన్ చెప్పింది. రెండాకుల చిహ్నం ఎవ్వరికి వస్తుందా ? అంటూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/చెన్నై: అన్నాడీఎంకే పార్టీ చిహ్నం రెండాకుల చిహ్నం ఎవ్వరికి ఇవ్వాలి ? అనే విషయం అక్టోబర్ 5వ తేదీ తేల్చేస్తామని భారత ఎన్నికల కమిషన్ చెప్పింది. రెండాకుల చిహ్నం ఎవ్వరికి వస్తుందా ? అంటూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తమిళనాడు ప్రజలు నన్ను సీఎం చేస్తారు, కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా: కమల్ హాసన్!తమిళనాడు ప్రజలు నన్ను సీఎం చేస్తారు, కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా: కమల్ హాసన్!

రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని శశికళ వర్గం, పన్నీర్ సెల్వం వర్గాలు భారత ఎన్నికమిషన్ ను ఆశ్రయించాయి. అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళను నియమిస్తూ గతంలో ఎడప్పాడి పళనిసామి వర్గం భారత ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు ఇచ్చింది.

అమ్మ వారసులు మేమే

అమ్మ వారసులు మేమే

అన్నాడీఎంకే పార్టీకి నిజమైన వారసులు మేమే అంటూ పన్నీర్ సెల్వం వర్గం భారత ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు సమర్పించారు. రెండాకుల చిహ్నం కోసం ఇరు వర్గాలో పోటీపడుతున్నాయి. ఇటీవల ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం ఒక్కటి అయ్యారు.

శశికళ, దినకరన్ ఔట్

శశికళ, దినకరన్ ఔట్

అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్ ను శాశ్వతంగా బహిష్కరించామని ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఇటీవల తీర్మానించారు. శశికళ, దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించామని భారత ఎన్నికల కమిషన్ కు సమాచారం ఇచ్చారు.

సీఎం, మంత్రులు బహిష్కరణ

సీఎం, మంత్రులు బహిష్కరణ

ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వంతో పాటు పలువురు మంత్రులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నానని టీటీవీ దినకరన్ ప్రకటించారు. శశికళ అనుమతి లేకుండా పార్టీ సమావేశం నిర్వహించారని టీటీవీ దినకరన్ భారత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

మద్రాస్ హైకోర్టు

మద్రాస్ హైకోర్టు

తనను సంప్రధించకుండా రెండాకుల చిహ్నం ఎవ్వరికీ కేటాయించరాదని టీటీవీ దినకరన్ భారత ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు. రెండాకుల చిహ్నం ఎవ్వరికి కేటాయిస్తారు అనే విషయం అక్టోబర్ 31వ తేదీలోపు తేల్చి చెప్పాలని మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ భారత ఎన్నికల కమిషన్ కు సూచించింది.

ముందుగానే ఇచ్చేస్తాం

ముందుగానే ఇచ్చేస్తాం

అక్టోబర్ 5వ తేదీ రెండాకుల చిహ్నం ఎవ్వరికి కేటాయిస్తామో ప్రకటిస్తామని భారత ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మమల్ని సంప్రధించాలని భారత ఎన్నికల కమిషన్ అన్నాడీఎంకే పార్టీలోని ఇరు వర్గాలకు సూచించింది.

సీఎం, శశికళ వర్గాలకు నోటీసులు

సీఎం, శశికళ వర్గాలకు నోటీసులు

మీదగ్గర ఇంకా ఏమైనా అఫిడవిట్లు ఉంటే ఈనెల 29వ తేదీలోపు మా దగ్గర సమర్పించాలని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, జైల్లో ఉన్న శశికళ, టీటీవీ దినకరన్ కు భారత ఎన్నికల కమిషన్ సూచించింది.

 మీవైపు ఎంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ?

మీవైపు ఎంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ?

అన్నాడీఎంకే పార్టీ గుర్తు మీద ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు ఎవరివైపు ఎంత మంది ఉన్నారు అనే పూర్తి సమాచారం మాకు ఇవ్వాలని భారత ఎన్నికల కమిషన్ ఇరు వర్గాలకు సూచించింది. రెండాకుల చిహ్నం మాకే వస్తుందని ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

English summary
The Election Commission of India on Thursday told the factions of the AIADMK that it will hear their competing claims to the party's frozen 'two leaves' poll symbol on October 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X