ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన సీఎం పళని, పన్నీర్: అఫిడవిట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేల లిస్ట్ !

భారత ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన ఈపీఎస్, ఓపీఎస్జయలలితకు నిజమైన వారసులు మేమే, అఫిడవిట్లు ఇచ్చిన సీఎం, డీసీఎం గ్రూప్ఈసీకి మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేల వివరాలు, రెండాకులు చిహ్నం మాదే అంటూ ధీమా

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు కలిసిపోయాయని, ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి పార్టీ రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భారత ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు.

ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం మద్దతుదారులు శుక్రవారం ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని లేఖ ఇచ్చారు. తమ వర్గంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు, వారి పేర్లు, వివరాలు, కొన్ని అఫిడవిట్లు ఎన్నికల కమిషన్ అధికారులకు సమర్పించారు. అక్టోబర్ 5వ తేదీ మద్యాహ్నం 3 గంటలకు రెండాకుల చిహ్నం ఎవరికి కేటాయించామో అనే వివరాలు ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.

AIADMKs two leaves symbol will recover says OPS and EPS

శుక్రవారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. రెండాకుల చిహ్నం మాకే వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గుర్తు మీద పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జయలలితకు, అన్నాడీఎంకే పార్టీకి తామే నిజమైన వారసులని ఈపీఎస్, ఓపీఎస్ చెప్పారు.

అన్నాడీఎంకే పార్టీని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న శశికళ, టీటీవీ దినకరన్, వారి కుటుంబ సభ్యుల చేతికి పార్టీ చిహ్నం ఇవ్వమని అన్నారు. మెజారిటీ ఎంపీలు, శాసన సభ్యులు మా వైపే ఉన్నారని సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+