కర్ణాటకలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం, బళ్లారిలో చాలెంజ్, కాంగ్రెస్ హంగామా!

Posted By:
Subscribe to Oneindia Telugu

బళ్లారి/బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాద్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ మొదటి సారి కర్ణాటకలో అడుగుపెడుతున్నారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ ఫిబ్రవరి 10వ తేదీ శనివారం శ్రీకారం చుట్టారు. శనివారం మద్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా బళ్లారి విమానాశ్రం చేరుకుంటారు. తరువాత బళ్లారి నుంచి హోస్ పేట చేరుకుని ఎన్నికల ప్రచారం మొదలుపెడుతారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో హంగామా మొదలైయ్యింది.

  Rahul Gandhi Tweets Supporting AP MPs Protest in Parliament
  సీఎం సిద్దూ రెడీ

  సీఎం సిద్దూ రెడీ

  యువరాజు రాహుల్ గాంధీకి స్వాగతం పలకడానికి ఇప్పటికే సీఎం సిద్దరామయ్య బళ్లారిలో మకాం వేశారు. కేపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జ్ వేణుగోపాల్, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్ హోస్ పేటలో మకాం వేసి కార్యక్రమం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

  వాటర్ బాటిల్ మీద కాంగ్రెస్ స్టిక్కర్

  వాటర్ బాటిల్ మీద కాంగ్రెస్ స్టిక్కర్

  రాహుల్ గాంధీ బహిరంగ సభకు హాజరవుతున్న వారికి ఆహారం, వాటర్ బాటిల్స్, కాంగ్రెస్ పార్టీ టోపీలు పంచిపెట్టడానికి సర్వం సిద్దం చేశారు. వాటర్ బాటిల్ మీద కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్ అతికించి ఇచ్చి ఆలా కూడా ప్రచారం చేసుకుంటున్నారు.

   ఆనంద్ సింగ్ కు చాలెంజ్

  ఆనంద్ సింగ్ కు చాలెంజ్

  ఇటీవల బీజేపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనంద్ సింగ్ నియోజక వర్గం హోస్ పేటలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం మొదటి బహిరంగ సభ సమావేశం కావడంతో ఆయన చాలెంజ్ గా తీసుకుని భారీ ఎత్తున కార్యకర్తలను తరలిస్తున్నారు.

  దేవాలయాలు, దర్గాలు

  దేవాలయాలు, దర్గాలు

  హోస్ పేటలో బహిరంగ సభ సమావేశం పూర్తి అయిన వెంటనే రాహుల్ గాంధీ కోప్పళ వెలుతున్నారు. సాయంత్రం కకనూరులో జరిగే సమావేశంలో పాల్గొంటున్నారు. మార్గం మధ్యలో రాహుల్ గాంధీ దేవాలయాలు, దర్గాలు సందర్శించనున్నారు.

  భారీ బందోబస్తు

  భారీ బందోబస్తు

  రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా కర్ణాటక ప్రభుత్వం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే హోస్ పేట, కోప్పళలో అదనపు బలగాలు మొహరిస్తున్నాయి. రాహుల్ గాంధీ నాలుగు రోజుల పర్యటన, బహిరంగ సభలు, రోడ్ షోలు విజయవంతం చెయ్యాలని సీఎం సిద్దరామయ్య ఇప్పటికే స్థానిక నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AICC president Rahul Gandhi will visit Karnataka on February 10, 2018. In his three day tour he will visit North Karnataka districts. Here are the road show, route map.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి