వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. ప్రయోజనం కంటే రిస్కే ఎక్కువ.. ఎయిమ్స్ వైద్యులు కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. జనవరి 3 నుంచి ఈ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే ప్రధాని నిర్ణయంలో ఎయిమ్స్ డాక్డర్ సంజయ్ కె రాయ్ విభేదించారు. ఇది అశాస్త్రీయమని పేర్కొన్నారు. పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తే ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యం అశాస్త్రీయం

ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యం అశాస్త్రీయం

వచ్చే ఏడాది జనవరి 3 నుంచి పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం అశాస్త్రీయం అన్నారు ఎయిమ్స్ డాక్డర్ సంజయ్ కె రాయ్ . కేంద్రం నిర్ణయం తమను ఎంతో నిరాశపర్చిందన్నారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదని పేర్కొన్నారు. ఎయిమ్స్‌లో సీనియర్ ఎపిడెమియోలజిస్ట్‌గా డాక్టర్ రాయ్ ఉన్నారు.

పిల్లలు, పెద్దలకు సంబంధించిన కొవాగ్జిన్ ట్రయల్స్‌లో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా ఆయన ఉన్నారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్‌కు అధ్యక్షుడుగా రాయ్ కొనసాగుతున్నారు. అందుబాటులో ఉన్న రిపోర్ట్ ప్రకారం పిల్లల్లో ఇన్‌ఫెక్ష‌న్‌ తీవ్రత చాలా స్వల్పమని పేర్కొన్నారు. ప్రతి రెండు మిలియన్ల జనాభాకు రెండు మరణాలు చోటుచేసుకున్నాయని చెప్పారు.

పిల్ల‌ల‌కు వ్యాక్సిన్.. ప్ర‌యోజ‌నం కంటే రిస్క్ ఎక్కువ‌..

పిల్ల‌ల‌కు వ్యాక్సిన్.. ప్ర‌యోజ‌నం కంటే రిస్క్ ఎక్కువ‌..

పిల్లలకు వ్యాక్సినేషన్‌ను ఇప్పటికే పలు దేశాలు మొదలు పెట్టాయి. కనుక మన దేశంలో పిల్లలకు టీకాలు ఇచ్చే ముందు ఆయా దేశాల డేటాను విశ్లేషించాల్సి ఉందన్నారు డాక్టర్ రాయ్. దీని వల్ల కాలేజీలకు , పాఠశాలలకు వెళ్లే పిల్లలు, వారి తల్లిదండ్రులలో భయాందోళనలు తగ్గుతాయని పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై కట్టడికి ఊతమిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ రాయ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తే ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

బూస్ట‌ర్ డోసు తీసుకున్నా క‌రోనా వైర‌స్‌..

బూస్ట‌ర్ డోసు తీసుకున్నా క‌రోనా వైర‌స్‌..


కొన్ని దేశాలలో బూస్టర్ డోసు తీసుకున్న తర్వాత కూడా ఇన్‌ఫెక్ష‌న్ బారిన పడిన కేసులు వెలుగులోకి వస్తున్నాయని డాక్ట‌ర్ రాయ్ పేర్కొన్నారు. అమెరికా, యూకేలో ప్రతి రోజు లక్ష‌ల కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. దీనిని బట్టి కరోనా వైరస్ ఇన్‌ఫెక్ష‌న్‌ను వ్యాక్సినేషన్ నిరోధించలేదని నిరూపితమవుతుందని అభిప్రాయపడ్డారు.

అయితే కరోన వైరస్ సోకిన వారిలో తీవ్రత, మరణాలను సమర్థవంతంగా ఈ వ్యాక్సిన్లు నిరోధించినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ పెంచడం ద్వారా 90 శాతం వరకు మరణాలను నిరోధించగలిగామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్ల‌కు వ్యాక్సిన్ ఇస్తే ప్రమాదం ఎంత, ప్రయోజనం ఎంత అనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

జ‌న‌వ‌రి 3 నుంచి పిల్ల‌ల‌కు వ్యాక్సిన్‌

జ‌న‌వ‌రి 3 నుంచి పిల్ల‌ల‌కు వ్యాక్సిన్‌

ప్రధాని మోదీ శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి పిల్లలందరికీ జనవరి 3 నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 15 ఏళ్లు దాటిన పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఇందువల్ల స్కూళ్లుకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల‌లో కూడా ఆందోళన తగ్గుతుందన్నారు. స్కూళ్లు, కాలేజీలలో బోధన యథాపూర్వ పరిస్థితికి రావడానికి ఈ వ్యాక్సినేషన్ దోహదపడుతుందని మోదీ చెప్పారు. అటు పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్‌పై వైద్య నిపుణుల‌లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి..

English summary
AIIM Doctor Sanjay K Roy On vaccination to childern Unscientific .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X