యూపీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం: 29స్థానాల్లో గెలుపు

Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్ మున్సిపల్లో ఎన్నికల్లో పోటీ చేసి పలు స్థానాల్లో విజయం సాధించి ఆ రాష్ట్రంలో ఏఐఎంఐఎం ప్రవేశించింది. యూపీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐఎం 78 వార్డులకు పోటీ చేసి 29 వార్డుల్లో గెలుపొందడం గమనార్హం.

ఫిరోజాబాద్‌లో 11 సీట్లను, మహుల్‌ అజంగర్‌లో 11 సీట్లను ఎంఐఎం గెలుచుకుంది. సంభల్‌, అమ్రోహ,మీరట,భాగ్పట్‌లలో రెండేసి సీట్లను, ఘజియాబాద్‌, కాన్పూర్‌,బిజ్నోర్‌,అలహాబాద్‌,సీతాపూర్‌ కార్పొరేషన్లలో ఒక్కో స్ధానాన్ని దక్కించుకుంది.

AIMIM Debuts in Uttar Pradesh Civic Polls, Wins Seats in Various Municipal Bodies

ఫిరోజాబాద్‌ మేయర్‌ స్ధానానికి జరిగిన పోరులో తమ పార్టీ రెం‍డో స్ధానంలో నిలిచిందని, తమ మేయర్‌ అభ్యర్థికి 56,536 ఓట్లు పోలయ్యాయని ఎంఐఎం వర్గాలు తెలిపాయి. బీజేపీ మేయర్‌ అభ్యర్థి నూతన్‌ రాథోర్‌ దాదాపు లక్ష ఓట్ల ఆధిక్యంతో ఇక్కడ గెలుపొందారు.

యూపీ స్థానిక ఎన్నికల్లో తమ పార్టీని ఆదరించిన ప్రజలకు ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 14మున్సిపల్ మేయర్ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 12బీజేపీ దక్కించుకోవడం కోవడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIMIM managed to bag 12 municipal councillor posts, four nagar palika parishad member posts and 4 nagar panchayat posts, as per the data provided by state Election Commission.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X