మళ్లీ ఉత్తరాదిలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు మజ్లిస్ రెడీ! ఈ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లలో పోటీ..!

ఇప్పటివరకూ తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి సీట్లలో మాత్రమే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ (ఎంఐఎం) ఈసారి ఈ పోరును ఉత్తరాదికి విస్తరించేందుకు సిద్దమవుతోంది. గతంలో యూపీ, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లకు, స్ధానిక ఎన్నికల్లో పోటీ చేసి పలు సీట్లు గెలిచిన ఎంఐఎం ఈసారి అవే రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లకు పోటీ చేసేందుకు వ్యూహరచన చేస్తోంది.

యూపీలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న 20 ఎంపీ సీట్లకు పోటీ చేయాలని మజ్లిస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బీహార్ లోని ఏడు లోక్ సభ సీట్లకు పోటీ చేసేందుకు మజ్లిస్ వ్యూహరచన చేస్తోంది. అటు మహారాష్ట్రలోనూ ముంబై, మరఠ్వాడా సీట్లకు పోటీ చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ సీట్లకు పోటీ చేస్తున్న మజ్లిస్.. ఇతర లోక్ సభ సీట్లలోనూ పోటీ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

AIMIM plans to extend loksabha poll contest to up bihar and maharastra

ప్రస్తుతం లోక్ సభలో ఎంఐఎంకు రెండు సీట్లు ఉన్నాయి. హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎంపీగా ఇంతియాజ్ జలీల్ ఉన్నారు. అలాగే గత సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ లోని కిషన్ గంజ్ స్ధానంలో పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్ధి అఖ్తరుల్ ఇమాన్ 3 లక్షల ఓట్లు సాధించారు. దీంతో కిషన్ గంజ్ తో పాటు మరో ఆరు సీట్లలో పోటీకి మజ్లిస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అటు యూపీలోనూ భారీ ఎత్తున లోక్ సభ సీట్లలో పోటీకి మజ్లిస్ చేస్తున్న ప్రయత్నాలు ఇండియా కూటమికి ఇబ్బందిగా మారబోతున్నాయి. గతంలో యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో గెలిచే బలం లేకపోయినా పోటీ చేసి కాంగ్రెస్ ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేశారన్న అపప్రద మూటగట్టుకున్న మజ్లిస్.. మరోసారి అలాంటి ప్రయత్నాలే చేస్తుండటం ఎన్డీయేకు మేలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+