20కి పైగా యుద్ధ విమానాలు.. 3,500 గంటల ఫ్లయింగ్.. భారత వైమానిక దళానికి కొత్త బాస్!
భారత వైమానిక దళం నూతన అధిపతిగా(ఐఏఎఫ్ చీఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 43 ఏళ్ల సుదీర్ఘ సేవ అనంతరం పదవీ విరమణ పొందిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ నుంచి ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. సాధారణంగా విమానం నడిపే అనుభవంతో పాటు 20కి పైగా విభిన్న రకాల విమానాల్లో 3,500 గంటలకు పైగా విమానాలు నడిపిన అత్యంత అనుభవం కలిగిన ఫైటర్ పైలట్‌గా అశుతోష్ దీక్షిత్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
నాలుగు శతాబ్దాల సుదీర్ఘమైన ప్రయాణం
నాలుగు దశాబ్దాల పాటు సాగిన తన సుదీర్ఘ సైనిక ప్రయాణంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ కమాండ్, స్టాఫ్, ఇన్‌స్ట్రక్షనల్ విభాగాల్లో అనేక కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. డిసెంబర్ 6, 1986న భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ స్ట్రీమ్‌లో ఆయన నిమామకం పొందారు. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌ల పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. మిరాజ్-2000, మిగ్ వేరియంట్లు, కిరణ్, జాగ్వార్, ఐఎల్-78, హాక్, తేజస్ వంటి అధునాతన విమానాల్లో 3,500 గంటలకు పైగా విస్తృతమైన ఫ్లయింగ్ అనుభవం ఆయనకు ఉంది. ఆయన ఓ ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ కూడా.

కీలక ఆపరేషన్లలో భాగస్వామ్యం
తన సేవ కాలంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ అనేక చారిత్రాత్మక సైనిక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ సింధూర్ వంటి ముఖ్యమైన మిషన్లలో ఆయన సేవలందించారు. పశ్చిమ రంగంలో ఉన్న కీలకమైన ఫ్రంట్-లైన్ ఫైటర్ ఎయిర్ బేస్‌తో పాటు దక్షిణ రంగంలోనే ప్రముఖ ఫైటర్ శిక్షణ కేంద్రానికి కూడా ఆయన నేతృత్వం వహించారు. వైమానిక దళ నూతన అధిపతిగా ఆయన నియామకంపై పలువురు ఆర్మీ, డిఫెన్స్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
एयर चीफ मार्शल आशुतोष दीक्षित, PVSM, AVSM, VM, VSM ने 29वें वायु सेना प्रमुख के रूप में कार्यभार संभाला।उन्होंने एयर चीफ मार्शल एपी सिंह, PVSM, AVSM का स्थान लिया है, जो देश की 42 वर्षों तक शानदार सेवा करने के बाद सेवानिवृत्त हुए।#IndianAirForce #IAF #AshutoshDixit @IAF_MCC
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) October 31, 2026














Click it and Unblock the Notifications
