బెంగళూరా మజాకా: ఇక పబ్లిక్ ఏసీ టాయిలెట్స్
బెంగళూరు: ఏసీ కార్యాలయాలు, ఏసీ భవనాలు, ఏసీ షోరూంలో మనం చూసి ఉంటాం. అయితే నిత్యం వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారికి కోసం రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ లలో ఏసీ ఎర్పాటు చేసి అందరిని ముక్కన వేలు వేసుకునే విధంగా చేశారు.
బెంగళూరు నగరంలో పబ్లిక్ టాయిలెట్స్ లలో ఏసీ మిషన్ లు ఏర్పాటు చేస్తున్నారు. నమ్మ బెంగళూరు, నమ్మ కుడుగె (మా బెంగళూరు, మా బహుమతి)లో భాగంగా నగరంలోని 23 పబ్లిక్ టాయిలెట్స్ లలో ఏసీ మిషన్ లు ఏర్పాటు చెయ్యాడానికి విశాల్ ఇంటర్నేషనల్ అనే ఎన్ జీఓ సంస్థ ముందుకు వచ్చింది.
ఒక్క చోట రూ. ఆరు లక్షలు ఖర్చు!
పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రంగా పెట్టి బెంగళూరు నగరానికి మరింత మంచి పేరు తీసుకురావాలని వీరు భావించారు. ఒక్కోక్క పబ్లిక్ టాయిలెట్ లో ఏసీ ఏర్పాటు చెయ్యడానికి రూ. 6 లక్షల ఖర్చు అవుతుందని విశాల్ ఇంటర్నేషనల్ కు చెందిన సతీష్ శాస్త్రీ అంటున్నారు.

బెంగళూరు నగరంలోని మహాలక్ష్మి లేఔట్ లో ప్రయోగాత్మకంగా పబ్లిక్ టాయిలెట్ కు మరమత్తులు చేసి ఏసీ ఏర్పాటు చేశారు. తరువాత మెజస్టిక్, కేఆర్ మార్కెట్, మడివాళతో పాటు నగరంలోని 23 ప్రాంతాలలో ఉన్న పబ్లిక్ టాయిలెట్ ల కు ఏసీ ఎర్పాటు చేస్తున్నారు.
ఏసీ ఏర్పాటు చేసిన తరువాత టాయిలెట్ ల దగ్గర ఎక్కువ రుసుం వసూలు చెయ్యమని, ప్రస్తుతం ఎంత వసూలు చేస్తుంటే అంతే వసూలు చేస్తారని ఎన్ జీఓ నిర్వహకులు అంటున్నారు. ఏసీ టాయిలెట్ల నిర్వహణ స్వచ్చంద సంస్థలకు అప్పగిస్తున్నామని నిర్వహకులు తెలిపారు.












Click it and Unblock the Notifications