ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం: అత్యంత సమీపానికి ఎయిరిండియా, నేపాల్ విమానం
హైదరాబాద్: ఆకాశంలో ఘోర ప్రమాదం తప్పింది. ఎయిరిండియా, నేపాల్ ఎయిర్‌లైన్స్ లకు చెందిన విమానాల్లో గాల్లోనే దాదాపు ఢీకొట్టుకున్నంత పనిచేశాయి. వెంటనే హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు ఆదివారం అధికారులు వెల్లడించారు.
నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం శుక్రవారం ఉదయం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఖాఠ్మాండ్ కు బయల్దేరింది. ఇటు ఢిల్లీ నుంచి ఖాఠ్మాండ్‌కు ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకుంది. మార్గమధ్యలోకి ప్రవేశించగా.. అవి రెండు అత్యంత సమీపానికి వచ్చాయి.

ఎయిరిండియా విమానం 19 వేల అడుగుల ఎత్తు నుంచి కింది దిగుతుండగా.. ఆ సమయంలో నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం అదే ప్రదేశంలో 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. రెండు విమానాలు అత్యంత సమీపంలో ఉన్నాయని రాడార్ వెంటనే హెచ్చరించడంతో.. పైలట్లు అప్రమత్తమయ్యారు.
నేపాల్ విమానం వెంటనే ఏడువేల అడుగులకు దిగింది. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు, ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు నేపాల్ పౌర విమానయానయాన సంస్థ వెల్లడించింది.
విధుల్లో అజాగ్రత్తగా వ్యవహరించినందుకుగానూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులపై వేటు వేసింది. మరోవై ఈ ఘటనపై ఎయిరిండియా ఇప్పటివరకైతే స్పందించలేదు.












Click it and Unblock the Notifications