వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇటలీ టు అమృతసర్.. విమానంలో కరోనా కలకలం.. 125 మందికి పాజిటివ్

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి సారి విరుచుకుపడుతోంది. కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విదేశాల నుంచి వచ్చే వారిని ఎయిర్ పోర్టునే కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇటలీ నుంచి వచ్చిన ఓ విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఒక్కసారిగా ఇంత మందికి వైరస్ సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. క‌రోనా సోకిన‌ వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.

 విమానంలో 179 ప్ర‌యాణికులు.. 125 మందికి క‌రోనా

విమానంలో 179 ప్ర‌యాణికులు.. 125 మందికి క‌రోనా

ఇటలీ నుంచి పంజాబ్‌లోని అమృత్ సర్ విమానాశ్రయానికి ఎయిర్ ఇండియా ప్లైట్ చేరుకుంది. కరోనా నింధనలు అమలులో ఉన్న నేపథ్యంలో.. విమానంలో వచ్చిన ప్రమాణికులందరికి ఎయిర్ పోర్టులోనే కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 125 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ అంతర్జాతీయ ఛార్టెడ్ విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు వచ్చారని విమానాయశ్రయ డైరెక్టర్ వీకే సేథ్ వెల్లడించారు. క‌రోనా సోకిన వారంద‌రిని క్వారంటైన్‌కు తరలించినట్లు ఆయ‌న తెలిపారు.

ఇట‌లీలో నెగెటివ్.. అమృత‌స‌ర్‌లో పాజిటివ్..

ఇట‌లీలో నెగెటివ్.. అమృత‌స‌ర్‌లో పాజిటివ్..

ఇటలీ నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన విమానంలో ఒక్క‌సారిగా ఇంత మందికి కరోనా సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ప్ర‌యాణికులు మాత్రం ఇటలీలో విమానం ఎక్కక ముందు తమకు కరోన నెగిటివ్ వచ్చిందని.. ఇప్పుడు ఎలా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడూ లేదని విధంగా 179 మంది ప్రయాణికుల్లో 125 మందికి కరోనా సోకడం రావడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోందని వీకే సేథ్ పేర్కొన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విసృత వ్యాప్తియే దీనికి కారణమై ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

క‌రోన మ‌ళ్లీ విజృంభణ‌

క‌రోన మ‌ళ్లీ విజృంభణ‌


దేశంలో కరోనా మ‌హమ్మారి మ‌ళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా, ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచి 24 గంటల్లో 90,928 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 26 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. దేశంలో 26 రాష్ట్రాలకు ఒమిక్రాన్ విస్తరించింది. ప్రస్తుతం 2630 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 797 కేసులు, ఢిల్లీలో 465 కేసులు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

Recommended Video

Omicron: Maharashtra లో అత్యధికంగా | India| COVID 19 Omicron In India Update | Oneindia Telugu
ఇట‌లీలో వైర‌స్ విల‌య‌తాండం

ఇట‌లీలో వైర‌స్ విల‌య‌తాండం


ప్రపంచవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 25 లక్షలకుపైగా కరోనా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. మళ్లీ వైరస్ తీవ్రత పెరగడంతో ప్ర‌పంచ‌దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాలో వచ్చిన కొత్త కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్ వేరయంట్ వే అని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికా, ఫ్రాన్స్‌లోనే నమోదువుతున్నాయి. ఇటలీలోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. ఇటలీలో బుధవారం కొత్తగా 1, 89,109 మందికి కరోనా సోకింది. 183 మంది మరణించారు.

English summary
AIR India flight 125 passengers test corona positive at amritsar airport
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X