వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోడను ఢీకొన్న ఎయిర్ ఇండియా విమానం..తప్పిన పెను ప్రమాదం

|
Google Oneindia TeluguNews

త్రిచి: ఎయిర్ ఇండియా విమానంకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కేరళలోని త్రిచి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ఒకటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రహారీ గోడను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమయంలో మొత్తం 136 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు.

దుబాయ్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం అదుపు తప్పి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గోడను ఢీకొట్టింది. గోడ ధ్వంసం కాగా విమానం కూడా స్వల్పంగా ధ్వంసం అయ్యింది. ఇక ముంబై విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా పరీక్షించారు. అనంతరం ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు.

Air India flight to Dubai hits ATC wall in Trichy Airport, 136 passengers safe

విమానం త్రిచిలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రహరీ గోడను ఢీకొట్టడంపై అతర్గత విచారణకు ఆదేశించినట్లు ఎయిర్ఇండియా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు పైలట్, కోపైలట్లు వివరణ ఇవ్వాల్సిఉన్న నేపథ్యంలో వారి స్థానంలో మరొకరిని నియమించినట్లు తెలిపింది ఎయిర్ ఇండియా సంస్థ. మరోవైపు జరిగిన ఘటనపై పౌరవిమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్‌కు కూడా సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారని వారిని అక్కడి నుంచి మరో విమానంలో దుబాయ్‌కు పంపినట్లు వెల్లడించారు.

English summary
An Air India flight with 136 passengers on board hit a wall at Trichy Airport on Thursday and had to be diverted to Mumbai, news agency ANI reports.The plane going to Dubai hit the ATC compound wall at Trichy Airport and was damaged. It was later declared fit for operations after inspection at Mumbai airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X