వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఇండియా ప్లైట్ ల్యాండ్: మనేసర్ కంటోన్మెంట్ ఆస్పత్రిలో ప్రయాణికులకు చికిత్స, పర్యవేక్షణలోనే..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Coronavirus : Isolation Wrds For Indians Came In Air India Special Flight From China's Wuhan

కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చస్తోంది. వైరస్ బారినపడి ఇప్పటికే 259 మంది చనిపోగా.. వేలాదిమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వుహన్‌ నుంచి వైరస్ క్రమంగా విస్తరించింది. అక్కడున్న భారతీయులను ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకొచ్చారు. 324 మంది భారతీయ ప్రయాణికులతో వచ్చిన విమానం శనివారం ఢిల్లీలో ల్యాండయ్యింది.

324 మంది ప్రయాణికులు

324 మంది ప్రయాణికులు

శుక్రవారం అర్ధరాత్రి 1.17 గంటలకు చైనా నుంచి ఎయిర్ ఇండియా జంబో బీ747 విమానం ఢిల్లీ బయల్దేరింది. శనివారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. విమానంలో 324 మంది భారతీయ ప్రయాణికులు ఉన్నారు. వారితోపాటు రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన ఐదుగురు వైద్యులు, ఒక పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నారని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

14 రోజులు పర్యవేక్షణ

14 రోజులు పర్యవేక్షణ

ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణికులను మనేసర్‌ తరలిస్తారు. అక్కడ కంటోన్మెంట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. కరోనా వార్డుల కోసం ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. వీరందరినీ 14 రోజులపాటు అక్కడే ఉంచుతారు. ప్రయాణికులందరికీ వైద్య పరీక్షలు చేస్తారు. పాజిటివ్ రాకుంటే వారందరినీ స్వస్థలాలకు పంపిస్తారు. పాజిటివ్ వచ్చినవారికి వైద్య సేవలు అందిస్తారు.

నిలకడగా..

నిలకడగా..


కరోనా వైరస్ కేరళలో ఒకరికి సోకింది. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు ఒక్కరు కూడా మృతి చెందలేదని అధికారులు పేర్కొన్నారు. చైనా నంచి 324 మంది ప్రయాణికులను తీసుకురాగా.. మరో విమానం చైనా పంపిస్తామని ఎయిర్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి.

English summary
air India's jumbo B747 plane, evacuating 324 Indian nationals from the coronavirus-hit Wuhan in China, landed here morning, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X