మరో ఘోరం.. ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టిన పక్షి

అన్ని ప్రయాణాల్లో విమాన ప్రయాణం సురక్షితం అంటారు. కానీ ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి. నిత్యం సాంకేతిక సమస్యలతో వైమానిక సంస్థలు తలపట్టుకుంటున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు మృతి చెందారు.

ఈ ఘటన మరువక మందే మరో షాకింగ్ ఘటన జరిగింది. ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీ కొట్టింది. దిల్లీ నుంచి పుణే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మరోసారి పెను ప్రమాదం నుంచి బయటపడింది. దిల్లీ నుంచి పుణే వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో విమానాన్ని ఓ పక్షి ఢీ కొట్టింది. అయితే విమానం పుణేలో ల్యాండిగ్ అయిన తర్వాత ఎయిర్ పోర్టు సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు.

దిల్లీ నుంచి పుణే వెళ్లాల్సిన AI-2470 నెంబర్ గల ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం దిల్లీ నుంచి పుణే వెళ్తున్న క్రమంలో ఓ పక్షి విమానాన్ని ఢీ కొట్టింది. అయితే ఈ విషయాన్ని పైలట్ గుర్తించకపోవడం గమనార్హం. విమానం పుణేలో ల్యాండింగ్ అయ్యాక విమాన సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే విమానం తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు అధికారులు.

విమానాన్ని పక్షి ఢీ కొన్న ఘటనను ఎయిర్ ఇండియా ప్రకటించింది. "జూన్ 20న పుణే నుంచి దిల్లీ వెళ్లాల్సిన AI-2470 విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో ఆ విమాన ప్రయాణాన్ని రద్దు చేయడం జరిగింది. విమానం పుణేలో సురక్షితంగా ల్యాండింగ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించాము అని ఎయిర్ ఇండియా ఈ ఘటనపై వివరణ ఇచ్చింది.

అయితే అకస్మాత్తుగా విమానం రద్దు కావడంతో ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ పేర్కొంది. ప్రయాణికులు టికెట్లను రద్దు చేసుకుంటే రీఫండ్ ఉంటుందని తెలిపింది. తిరిగి బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రయాణికులను దిల్లీ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలిపింది.

Air India Flight from Delhi to Pune Struck by Bird

భారత్ లో ఇటీవల విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఓ విమానం కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. అంతేకాక ఇటీవల అనేక విమానాలు సాంకేతిక సమస్యలతో రద్దయ్యాయి. దీంతో విమాన ప్రయాణం అంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+