15 ని.లపాటు ప్రయాణీకులను బెంబేలెత్తించిన ఎయిరిండియా విమానం! ఎందుకంటే..

న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ప్రమాదం చోటు చేసుకుంది. విండో దగ్గరలోని ఆక్సిజన్ మాస్క్ ప్యాసింజర్ల పైన ఊడిపడింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. డీజీసీఏ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

ప్రయాణీకులను బెంబేలెత్తించిన ఈ సంఘటన గురువారం (ఏప్రిల్ 19) అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో చోటు చేసుకుంది. ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది.

 Air India plane hits turbulence, three injured; window panel falls off

విమానంలోని విండో ప్యానెల్ దగ్గరి మాస్క్ విరిగి ప్రయాణీకులపై పడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. దీంతో దాదాపు పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. భయంతో వణికారు.

విమానంలో సీటు బెల్టు ధరించని ఓ ప్రయాణీకుడు బంప్ వద్ద ముందున్న కేబిన్‌ను గుద్దుకున్నాడు. దీంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. బయటి విండో పగలకపోవడంతో ప్రమాదం తప్పింది.

అక్కడి ఓవర్ హెడ్ ప్యానెల్ పగలడంతో ఆక్సిజన్ మాస్కులు కిందపడ్డాయని తెలుస్తోంది. వైర్లు వేలాడాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న డీజీసీఏ ఈ విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డుకు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+