ఎయిర్ ఇండియా: విలువైన ఆస్తులను కూడా వదల్లేదు, వాటాల విక్రయంపై కపిల్ సిబాల్
ఎయిర్ ఇండియా 100 శాతం వాటాలను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో పెను దుమారం రేపింది. విపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీ తీరును తప్పుపడుతూ ఒంటికాలిపై లేచింది. మోడీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో ఆస్తులను నమ్మి సొమ్ముచేసుకొంటుందని విమర్శించింది.
ప్రభుత్వం వద్ద నగదు నిల్వలు లేవని, అందుకోసమే ఉన్న ఆస్తులను అమ్ముకుంటు వెళ్తుందని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ విమర్శించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, వృద్ధి రేటు కూడా 5 శాతం కన్నా తక్కువ నమోదవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని గుర్తుచేశారు. ఇలా ముందుకెళ్తే దేశంలో ఉన్న విలువైన వనరులు కనుమరగవుతాయని చెప్పారు.

ఎయిర్ ఇండియాలోని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో వాటాలు అప్పగిస్తామని పేర్కొన్నది. బిడ్లు దాఖలు చేసేందుకు ఆయా సంస్థలకు మార్చి 17 తేదీ గడువుగా నిర్ణయించింది. బిడ్డర్ 3.26 బిలియన్ల రుణం అందజేసి.. ఇతర బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుందని తెలిపింది. 2018లో ఎయిర్ ఇండియా 76 శాతం వాటాను విక్రయించడానికి ప్రయత్నించింది. అయితే అందుకు 5.1 బిలియన్ డాలర్లు కోట్ చేయడంతో.. బిడ్లు దాఖలు చేసేందుకు ఏ సంస్థ ముందుకురాలేదు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications