వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఇండియా ఉమెన్స్ డే స్పెషల్ : మహిళా సిబ్బందితోనే పూర్తి సర్వీసులు

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎయిర్ ఇండియా మహిళల్లో స్ఫూర్తి నింపడానికి, ఎయిర్ ఇండియాకు మహిళలు సేవలందిస్తున్న తీరు అందరికీ తెలిసేలా వినూత్న కార్యక్రమం చేపట్టింది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు అని, అటు వైమానిక రంగంలోనూ మహిళలు తమదైన శైలిలో సత్తా చాటుతున్నారని చూపించాలనుకున్న ఎయిర్ ఇండియా మహిళా దినోత్సవ స్పెషల్ గా నేడు పూర్తి సేవలను మహిళలతోనే అందించనుంది.

మహిళా సాధికారతకు పట్టం... శ్రీనిధి తెలంగాణ పిండివంటలతో ప్రగతి పథంమహిళా సాధికారతకు పట్టం... శ్రీనిధి తెలంగాణ పిండివంటలతో ప్రగతి పథం

నేడు మహిళలతోనే ఎయిర్ ఇండియా సర్వీసులు

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన పూర్తిగా మహిళా సిబ్బందితో ఎయిర్ ఇండియా సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది . 12 అంతర్జాతీయ, 40కి పైగా దేశీయ విమానాలను మహిళా సిబ్బందితోనే నడుపుతామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానంలో సేవలందించే ఎయిర్ హోస్టెస్ మాత్రమే కాదు పైలట్లు కూడా మహిళలే ఉంటారని తెలిపింది. బీ787, బీ777 విమానాలు కూడా ఈ సేవలు అందిస్తాయని వెల్లడించింది.

నేడు మహిళలు నడపనున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు

ఢిల్లీ నుండి సిడ్నీకి, ముంబై నుండి లండన్ కు, ఢిల్లీ నుండి రోమ్ కు , ఢిల్లీ నుండి లండన్ కు, ముంబై నుండి ఢిల్లీ మరియు షాంగై లకు, ఢిల్లీ నుండి ప్యారిస్ కు, ముంబై నుండి న్యూ ఇయర్ కు రెండు సర్వీసులు, ఢిల్లీ నుండి న్యూయార్క్ కు, ఢిల్లీ నుండి వాషింగ్టన్ కు, ఢిల్లీ నుండి చికాగోకు, ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో కు 12 ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను మహిళలు నడపనున్నారు. ఇది నారీ శక్తికి నిదర్శనం అని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

వైమానిక రంగంలో మహిళా శక్తికి నిదర్శనం

వైమానిక రంగంలోనూ అన్ని విభాగాల్లో మహిళలు పని చేస్తున్నారని మహిళలు ఏ రంగంలో అయినా సరే దూసుకుపోయే సత్తా ఉన్న వారు అని చెప్పటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఎయిర్ ఇండియా విమానాలలో నేడు మహిళలు పూర్తి స్థాయిలో తమ సేవలను అందించి నింగిలోకి దూసుకుపోయే సత్తా మాది అని చాటి చెప్పబోతున్నారు. నారీ శక్తిని ఆకాశ వీధిలో చాటనున్నారు.

English summary
National carrier Air India will be flying 12 international flights as well as 40-plus domestic flights with an all-women crew on International Women's Day, the airline said "Air India is set to fly 12 all-women crew flights on its medium and long-haul international routes and over 40 return domestic and short-haul flights all over India to celebrate the International Women's Day on March 8 this year," it said in a statement. women crew for operating so many flights on various international and domestic routes fuelled by their indomitable 'nari shakti'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X